దేశంలో రోజురోజుకూ ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్న సంగతి మనం గమనించొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ పొల్యూషన్ తగ్గింపునకు, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో సామాన్యులకు ఊరట కలిగించేందుకు గాను ఉపయోగపడతాయి. కాగా, అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టెస్లా రూపొందిస్తున్న ఎలక్ట్రిక్ కార్లతో ఆటోమొబైల్ రంగంలో వినూత్న మార్పులు వచ్చే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాగా, టెస్లా సంస్థ తన ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను భారతీయ మార్కెట్ లోనూ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబాని టెస్లా మోడల్ 3 ఎలక్ట్రిక్ కారును యూజ్ చేస్తున్నారు. టెస్టా ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకతలు తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపడతారు. అవేంటంటే..
టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ విడుదల చేస్తున్న టెస్లా ఎలక్ట్రిక్ కారు మోడల్ 3 సింగిల్, డ్యూయల్ మోటార్ సెటప్‌లలో అవెయిలబుల్‌గా ఉంటుంది. మోస్ట్ అవెయిటెడ్ మోడల్‌గా టెస్లా-3 ఉండగా, ఇది బేస్ వేరియంట్ పూర్తి ఛార్జీపై 423 కిలోమీటర్లు పయనిస్తుంది. ఈ కారు 6 సెకన్లలోనే వంద కిలోమీటర్లు పయనించగలదు. కాగా, ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ వేరియంట్ ఒకే పూర్తి ఛార్జీతో 586 కిలోమీటర్ల వరకు పయనిస్తుంది. ఈ వేరియంట్ కేవలం 3 సెకన్లలోనే వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టెస్లా 3 ఎలక్ట్రిక్ కారుకు ఇంటర్నేషనల్ మార్కెట్‌లోను ఫుల్ డిమాండ్ ఉంది.
అయితే, భారతీయ మార్కెట్‌ను కూడా టెస్లా సంస్థ టార్గెట్ చేస్తోంది. ఇప్పటికే టెస్లా సంస్థ మూడు ఎలక్ట్రిక్ కార్లను బెంగళూరులో కస్టమర్లకు అందించింది. ఇక భారతీయ వినియోగదారులు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల కోసమై వేచి చూస్తుండగా, దీని ధర కూడా బాగానే ఉండబోతున్నట్లు పలువురు అంచనా వేస్తున్నారు. అమెరికా మార్కెట్‌లో ప్రారంభ మోడల్ ధర రూ.30 లక్షల వరకు ఉండగా, ఇండియన్ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 లక్షలు అయ్యే చాన్స్ ఉంది.