తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ప్రతి ఒక్కరినీ కలవర పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక గతలో ఎన్నడూ లేనన్ని ట్విస్టులు పంచుతోంది. ఇక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు రాష్ట్రం మొత్తం సంచలనం రేపుతున్నాయి. ఇక్కడ మొదటి నుంచి అసలు టీఆర్ ఎస్ తరఫున ఎవరు నిలుస్తారనే ప్రశ్నే పెద్ద ట్విస్టుగా మారింది. అయితే ఎంతో మంది పేరు వినిపించినా ఇప్పటికీ ఎవరూ ఫైనల్ కాలేదు.
అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ తరఫున పోటీ ఇస్తాడనుకున్న కౌశిక్ రెడ్డిని టీఆర్ ఎస్ టికెట్ ఆశ చూపి కేసీఆర్ తన పార్టీలోకి తీసుకున్నాడనే ప్రచారం మొదటి నుంచి వినిపిస్తోంది. కాగా ఆయన కాల్ వాయిస్‌లు లీక్ అయినప్పటి నుంచే ఆయనకు టీఆర్ ఎస్ టికెట్ ఖాయమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అనుకున్నట్టు గానే ఆయన నిన్న సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఏకంగా కేసీఆరే రావడంతో టికెట్ ఖాయమే అని అంతా ఊహించారు. కానీ ఇక్కడే కేసీఆర్ ట్విస్టు ఇచ్చారు. కౌశిక్ చేరిక సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పదువులు శాశ్వతం కాదని, పార్టీలో ఉంటే అదే పెద్ద పవర్ అని, ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తించాలంటూ మాట్లాడటంతో అసలు టికెట్ ఖాయంగా లేదని కౌశిక్ అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో కౌశిక్ కూడా డైలమాలో పడ్డాడని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి కేసీఆర్ ఏం చేస్తారో.