పాముకాటుతో చనిపోతే లక్షల్లో పరిహారం ఇస్తారు తెలుసా..?

-

ఏటా పాముకాటుతో ఎంతో మంది చనిపోతుంటారు. పాముకాటుకు గురవ్వడంతో, పాము కాటుకు గురై చనిపోవడం మన దేశంలో చాలా సాధారణ విషయం అయిపోయింది. గడిచిన 20 ఏళ్లలో 1.2 మిలియన్లకు పైగా ప్రజలు విషసర్పాల కాటుకు బలైనట్లుగా సర్వేలో తేలింది. భారతదేశంలో మొత్తం 276 రకాల పాములు ఉన్నాయి. వాటిలో 20-30 శాతం అత్యంత విషపూరితమైనవిగా గుర్తించారు. అలాంటి పాములు కాటేస్తే ఎంతటి వారైనా చనిపోవడం ఖాయం. పాముకాటుతో చనిపోవడాన్ని మన దేశంలోని చాలా రాష్ట్రాలు విపత్తు మరణంగా ప్రకటించాయి. కాబట్టి పాము కాటుకు గురై చనిపోయిన వ్యక్తి కుటుంబానికి పరిహారం చెల్లిస్తున్నాయి. ఆ రాష్ట్రాలు ఏంటి, ఆ పరిహారం ఎంతనో చూద్దామా.।!

కేరళలో విషపూరితమైన పాముకాటు వల్ల మరణిస్తే పరిహారం మృతుని కుటుంబానికి అందజేస్తారు. ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో పాము కాటుతో చనిపోయిన వాళ్ల కుటుంబాలకు 4 లక్షల రూపాయల పరిహారం అందజేస్తున్నారు. పాము కాటుతో రైతు చనిపోతే రైతు బీమా పథకం కింద లక్ష రూపాయల పరిహారం అందజేస్తోంది. ఈ పరిహారం మొత్తాన్ని బాధిత కుటుంబానికి అందజేయడం జరుగుతుంది.

భారతదేశంలో అనేక రకాల విషపూరిత పాములు ఉన్నాయి. అందులో కింగ్ కోబ్రా ఒకటి. ఈ పాము కాటుతో ఇండియాలో ఏటా 64,000 మంది మృత్యువాత పడుతున్నారు. 20 సంవత్సరాల రికార్డులు చూస్తే ఒక్క భారతదేశంలోనే 1.2 మిలియన్లకు పైగా ప్రజలు పాముకాటుతో మరణించారు. 97% మరణాలు గ్రామీణ ప్రాంతాల్లోనే జరిగాయి. పాముకాటు వల్ల స్త్రీల కంటే పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు. మగ రైతులు పొలాల్లో పని చేయడం దీనికి ప్రధాన కారణం.

అయితే పాము కాటుతో ఎవరైనా చనిపోతే ..వారి కుటుంబ సభ్యులు పరిహారం పొందవచ్చు. అందుకోసం మృతుడ్ని పోస్ట్‌మార్టం రిపోర్ట్ చాలా ముఖ్యం. దాని ఆధారంగా మృతుడి కుటుంబానికి సాయం అందుతుంది. అందుకే పాము కాటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహానికి వెంటనే బంధువులు శవపరీక్షను నిర్వహించాలి. పాముకాటు వల్ల మరణిస్తే వెంటనే స్థానిక అధికారులకు తెలియజేయాలి. మిగిలినదంతా వాళ్లు చూసుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news