దేనికైనా ఓ పద్ధతి ఉంటుంది. అందాలు ఆరోబోయడం తప్పే కాదు. అస్సలు తప్పు కాదు. దానికి ఇది టైమ్ కాదు దిశా. దీపావళి పండుగ అంటే అర్థం తెలుసా నీకు. దీపావళి శుభాకాంక్షలను ఎవరన్నా ఇట్లా చెబుతారా? బ్రా చూపిస్తూ.. చేతిలో ప్రమిదను పట్టుకొని దీపావళి శుభాకాంక్షలు చెబుతారా? ఇదేనా మన సంస్కారం. మన దేశం మనకు నేర్పించింది ఇదేనా? నువ్వు ఆ బ్రా బ్రాండ్ కు అంబాసిడర్ వు కావచ్చు. కానీ.. దాని ప్రమోషన్ కోసం ఇలా పండుగను ఉపయోగించుకుంటావా? ఇదేనా నీకు మీ అమ్మానాన్న నేర్పించింది. రియల్లీ వీ డిడ్ నాట్ ఎక్స్ పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ దిశా… అంటూ దిశా పటానీ అభిమానులు తెగ బాధపడిపోతున్నారు.
ఎందుకు బాధపడుతున్నారో ఇప్పటికైనా మీకు అర్థమయి ఉంటుంది. అందుకే… పైన ఫోటో చూశారుగా. ఆ ఫోటోను దిశ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది. అంతే.. నెటిజన్లు ఆమెపై ఇదిగో అలా విరుచుకుపడ్డారు. మామూలుగా కాదు.. దీంతో తనను అబ్యూజ్ చేస్తూ వచ్చిన కామెంట్లను అన్నింటినీ డిలీట్ చేసి ఈ బ్యూటీ. వెంటనే కామెంట్లను డిజేబుల్ చేసేసింది. అది మ్యాటర్. ఏందో ఎవరి బాధ వారిది.. సీత కష్టాలు సీతవి. పీత కష్టాలు పీతవి.