కొత్త సంవత్సరం మొదటి రోజు ఈ పనులు అస్సలు చేయకండి

-

ఇంకో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. నూతన సంవత్సరంలో చాలా మంది.. జాతకాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. 2024 కొందరికి కలిసివస్తే.. కొందరికి ఎదురుదెబ్బ తీస్తుంది. అంతా మన చేతుల్లోనే ఉంటుంది. అయితే.. పండగ రోజు కొన్ని చేయకూడని పనులు ఉంటాయి. మీరు తెలిసి తెలియకుండా ఆ పనులు చేస్తే.. అనవసరంగా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.  2024 సంవత్సరం మొదటి రోజు అంటే జనవరి 1న కొన్ని కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. లేదంటే ఏడాది పొడవునా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని గురించి మరింత తెలుసుకుందాం…

డబ్బు అప్పుగా తీసుకుంటున్నారా..?

కొత్త సంవత్సరం ప్రారంభంలో ఎవరి దగ్గరా అప్పు తీసుకోకండి. దీని వల్ల ఏడాది పొడవునా మీకు ఆర్థిక నష్టం కలుగుతుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా మీరు ఒత్తిడికి లోనవుతారు.

ఎవరినీ ఖాళీ చేతులతో పంపకండి

కొత్త సంవత్సరం మొదటి రోజున ఎవరైనా పేదవారు లేదా ఏదైనా ఆశతో మీ ఇంటికి వస్తే, అతనిని ఖాళీ చేతులతో పంపించవద్దు. మీ సంకల్ప శక్తి ప్రకారం అతనికి ఏదైనా దానం చేయండి.

గాయపడకండి

కొత్త సంవత్సరం మొదటి రోజున ఒకరి హృదయాన్ని గాయపరచవద్దు. ఈ రోజును ఎలాంటి వాదనలతో ప్రారంభించవద్దు.

మాంసం-మద్యం

కొత్త సంవత్సరం మొదటి రోజు చాలా మంది పార్టీ మూడ్లో ఉంటారు. మందు మాంసంతో ఎంజాయ్‌ చేస్తారు. ఈ సమయంలో నాన్ వెజ్ మరియు ఆల్కహాల్ తీసుకుంటారు. అయితే కొత్త సంవత్సరం మొదటి రోజున ఈ విషయాలకు దూరంగా ఉండడం మంచిది.

పదునైన వస్తువులు

నూతన సంవత్సరం ప్రారంభంలో ఎలాంటి పదునైన వస్తువులను కొనడం మానుకోండి. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
కొత్త సంవత్సరం రోజు వీలైనంత హ్యాపీగా ఉండేందుకు ట్రై చేయండి. కోపాలు, ద్వేషాలను వీడండి.. ఎవరిమీద అయినా చిన్న చిన్న ఇష్యూస్‌ ఉంటే..కుర్చోని మాట్లాడుకుని పరిష్కరించుకోండి. అప్పుడే మీరు మనశాంతిగా ఉండగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news