పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారా?  

-

శరీరంలో ఒక్కో భాగంలో ఉండే పుట్టుమచ్చలు ఒక్కో అర్థాన్ని చెబుతుంటాయని అంటారు. దీనికోసం ప్రత్యేకంగా మచ్చ శాస్త్రం కూడా ఉంది. ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే అదృష్టం కలుగుతుంది అన్న విషయాలు ఆసక్తిగా ఉంటాయి.

ఈ సమయంలో పెదవిపై పుట్టుమచ్చ ఉన్నవారు శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ ఉంటారు. అది నిజమేనా? మచ్చశాస్త్రంలో అలాగే ఉందా? అనే విషయాలు ఇక్కడ చర్చిద్దాం.

ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా పెదవిపై పుట్టుమచ్చ ఉంటే ఏమవుతుందో? వారిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయనేది ఇక్కడ చూద్దాం.

పురుషుల్లో గానీ, మహిళల్లో గానీ పై పెదవిపై పుట్టుమచ్చ ఉన్నట్టయితే వారు జీవితాన్ని బాగా ఆనందించేవాళ్ళయి ఉంటారు. ప్రకృతి ఆరాధకులుగా ఉంటూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు శృంగారం పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది.

పై పెదవి లోపలి భాగంలో పుట్టుమచ్చ ఉన్న పురుషులు గానీ, మహిళలు గానీ రహస్యంగా ఉండడాన్ని కోరుకుంటారు. అన్ని చెప్పుకోవాలని వీరికి అనిపించదు. చాలా విషయాలు, కొన్ని కొన్ని సార్లు చాలా చిన్న చిన్న విషయాలు కూడా రహస్యంగా ఉంచాలని అనుకుంటారు. మంత్రాలు, శక్తుల మీద వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది.

ఒకవేళ పుట్టుమచ్చ కింద పెదవి లోపలి భాగంలో ఉన్నట్టయితే వారు భోజన ప్రియులై ఉంటారని, ఆహారం అంటే ఇష్టం కలవారై ఉంటారని మచ్చశాస్త్రం చెబుతుంది. అంతేకాదు కళలు, సాంస్కృతిక రంగాల్లో ఆసక్తి కలవారై ఉంటారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version