ట్రెడ్ మిల్ ని ఎందుకు కనిపెట్టారో తెలుసా..?

-

ఈ మధ్య కాలంలో చాలా మంది ఫిట్నెస్ పై శ్రద్ధ పెడుతున్నారు. జిమ్ కి వెళ్లడం లాంటి పద్దతులను ఫాలో అవుతున్నారు. అయితే చాలా మందికి ట్రెడ్ మిల్ గురించి తెలిసే ఉంటుంది. అయితే దీనిని మనం వాకింగ్, రన్నింగ్ లేదా జాగింగ్ చేయడానికి ఉపయోగిస్తుంటాం. చాలా మంది జిమ్ కి వెళ్లకుండా ఇంట్లోనే ట్రెడ్ మిల్ ని చేస్తున్నారు.

ఇలా ఫిట్నెస్ పై శ్రద్ధ ఉన్న వాళ్ళు ట్రెడ్ మిల్ ని ఇంట్లో పెట్టి దాని వలన కలిగే లాభాలను పొందుతున్నారు. అయితే మొదట్లో దీనిని రన్నింగ్ కోసమో జాకింగ్ కోసమో కనిపెట్టలేదు. దీన్ని జైలులో ఉండే ఖైదీల కోసం కనిపెట్టడం జరిగింది. అప్పట్లో ట్రెడ్మిల్ పైన వ్యాయామం చేయడం నిజంగా కష్టంగా ఉండేది. ఒక విధంగా టార్చర్ అని చెప్పాలి.

1818లో సర్ విలియం క్యూబిట్ దీన్ని కనిపెట్టారు. మొండిగా పట్టుదలతో ఉండే ఖైదీలకి బుద్ధి చెప్పడం కోసం దీనిని వాడేవారు అప్పట్లో దీని మీద నడవడం చాలా కష్టంగా ఉండేది. దీనిని మొదట్లో కనిపెట్టిన అప్పుడు 24 చువ్వలను ఉపయోగించారు. అయితే ఇది ఒక దానికి ఒకటి టచ్ అవ్వవు. ఆఖరన మాత్రం సీల్ చేసి ఉంటాయి. దీనిపైన నడుస్తూ ఉంటే రోల్ అవుతూ ఉంటాయి. నిజానికి దీనిపైన నడవడం అప్పట్లో నరకంగా ఉండేది అందుకోసమే దీన్ని కనిపెట్టారు. కానీ ఆ మిషన్ ని ఇప్పుడు మనం వ్యాయామం కోసం వాడుతున్నాము.

Read more RELATED
Recommended to you

Latest news