సక్సస్ అయిన వాళ్లు ఆఫీస్ చివరి 10నిమిషాల్లో చేసే 9 పనులేంటో తెలుసా.!

-

ఈ సమాజం ఓడిపోయిన వాడిమాట కంటే గెలిచిన వారి మాటే బాగా వింటుంది. స్టేజే పై నుల్చుని నువ్వేం చెప్పినా ఫస్ట్ నీ కంటూ ఒక స్థాయి ఉండాలి. లేదంటే ఈడెవుడు వచ్చి కొటేషన్స్ చెప్తున్నాడు అనుకుంటాం. జీవితంలో గెలిచినవారు చెప్పే చిన్న చిన్న టిప్స్ ని కూడా మనం చాలా గొప్పగా చూస్తుంటాం. షర్ట్ బటన్స్ పెట్టుకోవటం టైం వేస్ట్ అని టీ షర్ట్ వేసుకుంటాడట ఫేస్ బుక్ సీఈవో. ఎదగాలంటే హార్డ్ వర్క్ చాలా అవసరం. దాంతోపాటు మన అలవాట్లు. మనకున్న అలవాట్లే మనల్ని ఒక స్థాయిలో నిలబెడతాయి. మనకున్న అలవాట్లను బట్టి చెప్పేయొచ్చట..బాగుపడతామా లేదా అని. మనలో చాలామంది ఆఫీస్ టైం అయిపోయేముందు చేసే పనులేంటి. లంచ్ బాక్స్ తెచ్చుకోవటం, వాష్ రూంకి పోవటం, పక్కన కొలీగ్స్ తో మాట్లాడుకోవటం..దాదాపు ఇవే చేస్తారు..కానీ సక్సస్ అయిన వాళ్లు ఆఫీస్ అయిపోయే చివరి 10 నిమిషాల్లో ఏం చేస్తారో తెలుసా..!

1. మొదటగా తమ డెస్క్ ని సర్దుకుంటారట..అందేంటి డస్క్ సర్దటానికి వర్కర్స్ ఉంటారుగా అనుకుంటున్నారా..అయినా కొన్ని ఫైల్స్, పేపర్స మనం ఒక లెక్కలో పెడతాం. కాబట్టి అవి అంతా మనమే సర్దుకుంటే రేపు తీసుకోవటానికి ఈజీగా ఉంటుంది. అందుకే వాళ్లు కూడా మొదట డస్క్ సర్దుకుంటారట.

2. ఆ రోజు ఎన్ని పనులు చేసాము అన్నీ నోట్ చేసుకుంటారు. అంతే కాకుండా చేయాల్సిన పనుల గురించి కూడా ఒక లిస్టు రాసుకుంటారు.

3. మూడోది ఆఫీసులో ఉన్నప్పుడు ఏదైనా కాల్ వస్తే అది ఆన్సర్ చేయలేకపోతే ఈ 10 నిమిషాల్లో ఫోన్ చేసి మాట్లాడి విషయం
కనుక్కుంటారు.
4. ఆ రోజు వారు ఎవరితోనైనా మాట్లాడి సారీ లేదా థాంక్యూ వంటివి చెప్పాల్సి ఉంటే చెప్తారు.

5. నెక్స్ట్ డే ఏమేమి పనులు చేయాలి, ఏది కచ్చితంగా చేయాలి అనే విషయంపై కూడా పూర్తిగా షెడ్యూల్ రాసుకుంటారు.

6. ఇది చాలా ముఖ్యం.. ఆ రోజు ఒక వేళ డబ్బులు ఖర్చు అయి ఉంటే.. ఎన్ని ఖర్చయ్యాయి అనే విషయం కూడా నోట్ చేసుకుంటారు.

7. ఆ రోజు మర్చిపోయిన పనులు ఏమైనా ఉన్నాయేమో అని గుర్తు తెచ్చుకుంటారు. ఒకవేళ ఏదైనా మర్చిపోతే అవి ఎప్పుడు చేయాలో
షెడ్యూల్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకుంటారు.

8. అలాగే ఒకవేళ చిన్న చిన్న పనులు ఏమైనా మిగిలిపోతే అవి కూడా పూర్తి చేస్తారు.

9. ఒకవేళ ఆరోజు ఏమైనా తప్పులు జరిగితే అవి కూడా నోట్ చేసుకొని అవి మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారు.

పదినిమిషాల్లో ఇన్ని పనులు చేస్తారా అనుకుంటున్నారా..లిస్ట్ పెద్దగా ఉన్నా పనలు చిన్నవే..మీరు ఆఫీస్ నుంచి వచ్చే చివరిపదినిమిషాల్లో ఈ లిస్ట్ లో ఉన్నవి ఏమైనా ఉన్నాయా. లేకుంటే మీరు అలవాటు చేసేసుకోండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news