రేపు గుడ్ న్యూస్ చెబుతా : మంచు విష్ణు

-

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు నూతన అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన సంగతి తెలిసిందే. అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాష్ రాజ్..మంచు విష్ణు లు పోటీ పడగా అధిక మెజార్టీతో మంచు విష్ణు గెలుపొందారు. అనంతరం తన ఫ్యాన్ సభ్యులతో కలిసి మంచు విష్ణు ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఇక ఎన్నికలకు ముందు మంచు విష్ణు మా సభ్యులకు ఎన్నో హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మా కోసం బిల్డింగ్ పింఛన్లు.. ఉచిత విద్య, అంటూ మంచు విష్ణు హామీలిచ్చారు.

అయితే తాజాగా మంచు విష్ణు రేపు ఓ గుడ్ న్యూస్ చెబుతాను అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాంతో విష్ణు ఎలాంటి పరకటన చేస్తారా అని మా సభ్యులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి పోటీచేసి గెలిచిన అభ్యర్థులు అంతా “మా” కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ రాజీనామాలను విష్ణు ఇంకా ఆమోదించలేదని చెప్పారు. పదవులు లేకపోయినా తాము మా సమస్యల కోసం మాట్లాడదామని ప్రకాష్ ప్యానల్ సభ్యులు చెబుతున్నారు. మరో వైపు ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news