1986లో రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ బైక్‌ ధర ఎంతో తెలుసా..?

-

రాయల్‌ ఎన్‌ ఫీల్డ్..ఎంతోమంది అబ్బాయిల డ్రీమ్‌ బైక్… పేరుకు తగ్గట్టుగానే..ఈ బైక్‌ రాయల్‌గా ఉంటుంది. మంచి పర్సనాలిటీ ఉండి..ఈ బుల్లెట్‌ బండిమీద వస్తుంటే ఉంటుంది… సూపర్‌ అంతే.. డుగ్గు డుగ్గుమనే సౌండ్‌లోనే భలే వైబ్రేషన్స్‌ ఉంటాయి.. అయితే రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ ధర వల్ల ఆ బైక్‌ కొనాలన్న కల కలగానే మిగిలిపోతుంది.. కానీ 1986లో బుల్లెట్‌ బైక్‌ ధర ఎంతో తెలుసా..?

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350cc భారతదేశంలో చాలా ప్రజాదరణ పొందిన బైక్. దీన్నే బుల్లెట్ అని పిలుచుకుంటారు చాలా మంది. ఎన్ని రకాల బైక్స్ వచ్చినప్పటికీ దీన్ని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. కిందటి తరం నుంచి నేటి తరం వరకు ఇది వారసత్వంగా వచ్చింది. అయితే 1986 దీని ధరెంతో చెప్పే రశీదును రాయల్ ఎన్ ఫీల్డ్ వారు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. అదిప్పుడు వైరల్ అయింది. ఆ రశీదు 1986, జనవరి 23 నాటిది. దీన్ని జార్ఖండ్లోని బొకారోలో సందీప్ ఆటో కంపెనీకి చెందిన డీలర్ కొన్నాడు. అప్పట్లో ఈ బైకు 18,700 రూపాయలు అని ఆ రశీదు ద్వారా తెలుస్తోంది.

36 ఏళ్ల తరువాత దీని ధర 11 రెట్లు పెరిగింది. ఈ రశీదును చూసిన నెటిజన్లు షాక్‌ అయ్యారు.. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పదించారు.. ఒక వ్యక్తి తాను 1984లో రాయల్ ఎన్ ఫీల్డు బైక్ కొన్నానని, దాని ధర 16,100 అని కమెంట్‌ చేశారు. మరో వ్యక్తి 1984లో తన తాత రెండు వేల రూపాయలకు భూమి కొన్నారని, అదిప్పుడు రెండు కోట్ల రూపాయలు అయ్యిందని రాశారు. అవును మన తాతలు కూడా అప్పట్లో 100కి 500కే స్థలాలు కొనేసేవాళ్లు..

రాయల్ ఎన్‌‌ఫీల్డ్ కంపెనీ ఇంగ్లాండు దేశానిది. 1893లో ఈ సంస్థను స్థాపించారు. మొదట్లో రైఫిళ్లను తయారుచేసేవారు. 1901లో తొలిసారి బైక్ తయారు చేశారు. వీటిని రెండో ప్రపంచం యుద్ధ సమయంలో సైనికులు వాడేవారు. 1965లో భారత ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో పెట్రోలింగ్ కోసం ఈ బైక్‌లను వాడింది. తరువాత 1994లో ఈ సంస్థను మనదేశానికి చెందిన ఐషర్ కంపెనీ కొన్నది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన దేశం నుంచే ఈ బైక్‌లు ఎగుమతి అవుతున్నాయి. అలా రాయల్‌ ఎన్‌ఫిల్డ్‌ ఈ స్థాయికి వచ్చింది..! మార్కెట్‌లో ఎన్ని బైకులు ఉన్నా.. ఈ బైక్‌కు ఉన్న ఠీవీ, క్రేజ్‌ ఏ బైక్‌కు ఉండదు. కమెంట్‌ చేయండి మీ ఫేవరేట్‌ బైక్‌ ఏంటో..!

Read more RELATED
Recommended to you

Exit mobile version