5 వేల ఏళ్ళ నాటి శివలింగం ఎక్కడ ఉందో తెలుసా…?

-

హిందువులు ఎక్కువగా పూజించే దేవుళ్లలో శివుడు ముందు వరుసలో ఉంటాడు అనేది వాస్తవం. శివరాత్రి వస్తుంది అంటే అంటే చాలు భక్తులు 12 జ్యోతిర్లింగాల తో పాటుగా ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి శివుడ్ని దర్శించుకుంటారు. ఇందుకోసం ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు భక్తులు. వారణాసి, కేదారినాథ్, శ్రీశైలం, రామేశ్వరం ఇలా ఎక్కడ చూసినా సరే భక్తులు శివుడ్ని దర్శించుకోవడం కోసం బారులు తీరుతూ ఉంటారు.

ఇక శివుడి గురించి ఏ వార్త వచ్చినా సరే శివుడి భక్తులు ఎంతో ఆసక్తిగా వింటూ ఉంటారు. మీడియా కూడా శివుడి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. పురాతన శివాలయాలకు సంబంధించి ఎక్కువ కథనాలను ప్రచురిస్తూ ఉంటుంది. ఇక శివలింగాల చరిత్రతో పాటుగా అనేక అంశాలను భక్తులకు అందిస్తూ ఉంటుంది. అవి ఎలా ఏర్పడ్డాయి, వాటి చరిత్ర ఏంటీ అనే విషయాలను మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఒక ఆసక్తికర ఫోటో బయటకు వచ్చింది. అది ఇప్పటి శివలింగం కాదు. ఏళ్ళ నాటి శివలింగం. దానికి వేల ఏళ్ళ చరిత్ర ఉంది. పురావస్తు శాస్త్రవేత్త ఎం. వాట్స్ 5000 సంవత్సరాలకు పైగా వయసు ఉన్న మూడు శివలింగాలను హరప్ప వద్ద కనుగొన్నారు. ఈ అరుదైన ఆర్కైవల్ ఫోటో హరప్ప సైట్ లో తీసినట్టు తెలుస్తుంది. ఈ ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version