ఉద్యోగాలకు వెళ్ళాలంటే ముందుగా ఇంటర్వ్యూలకు వెల్లాల్సి ఉంటుంది.అదే సమయంలో, ఇంటర్వ్యూలో మీ నైపుణ్యాలతో పాటు, వ్యక్తిత్వ పరీక్ష కూడా జరుగుతుంది.ఇంటర్వ్యూలో సరైన డ్రెస్సింగ్ సెన్స్ పాటించడం చాలా ముఖ్యం. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని సాధారణ తప్పులను నివారించడం ద్వారా పరిపూర్ణ వృత్తిపరమైన రూపాన్ని సులభంగా మార్చుకోవచ్చు. నిజానికి, ఇంటర్వ్యూలో మంచి ఇంప్రెషన్ కొట్టేయడానికి దుస్తుల నుండి పాదరక్షలు, ఉపకరణాల వరకు శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. అయితే, ఇంటర్వ్యూకు వెళ్లే ముందు వ్యక్తులు తరచుగా కొన్ని సాధారణ తప్పులు చేస్తుంటారు.
ఈ తప్పుల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తె ఇంటర్వ్యూ లో విజయం సాధించడం పక్కా..ఇంటర్వ్యూ లో కొన్ని టిప్స్ పాటిస్తే విజయం మీదే..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్వ్యూ కోసం దుస్తుల ఎంపిక ఇంటర్వ్యూ చేసే పరిశ్రమపై ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి, ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్‌గా కనిపించడానికి.. సూట్, పాలిష్ బూట్లు ధరించడం చాలా అవసరం. కానీ, ఈ లుక్ ఫ్యాషన్ పరిశ్రమకు చాలా వింతంగా ఉంటుంది. అందేకే ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకుని ఇంటర్వ్యూ డ్రెస్‌ను సెలెక్ట్ చేసుకోవాలి..
ఇకపోతే చాలామందికి ఫెర్ఫ్యుమ్ ను వాడే అలవాటు ఉంటుంది.మంచి ఇంప్రెషన్ రావడానికి కొంత మంది డ్రస్‌పై హార్డ్ పర్‌ఫ్యూమ్‌ని వాడతారు. ఈ పెర్ఫ్యూమ్ సువాసన చాలా మందికి చికాకు కలిగిస్తుంది. అందుకే.. ఇంటర్వ్యూకి వెళ్లే ముందుతేలికపాటి ఫర్‌ఫ్యూమ్‌ను స్ప్రే చేసుకుని వెళ్లాలి..
సన్ గ్లాసెస్, ఫేషియల్ పియర్సింగ్‌లు, భారీ రింగ్‌లు, ప్రొఫెషనల్ దుస్తులతో మెరిసే గడియారాలను ధరిస్తారు. అయితే ఇవి కూడా మీ వైఖరిని నిర్ధేశిస్తాయి. ఈ కారణంగా.. ఇంటర్వ్యూ కోసం క్లాసీ వాచ్, సాధారణ రింగ్స్ ధరించడం సరిపోతుంది…లేదు అనుకుంటే వాడక పోతేనే మంచిది..ఇది ఈ టిప్స్ ఫాలో అయితే మాత్రం సగం సక్సెస్ అయినట్లే..