దూద్ సాగర్ జలపాతాన్ని చూస్తే చాలు.. మిమ్మల్ని మీరు మైమరిచిపోతారు..!

-

దాదాపు 310 మీటర్ల ఎత్తు ఉన్న కొండల నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. మీరు షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా చూశారా? ఆ సినిమాలో దూద్ సాగర్ జలపాతం వద్ద ఓ సీన్ ఉంటుంది.

దూద్ సాగర్ జలపాతం. దీని పేరు మీరు వినే ఉంటారు. ఆ జలపాతాన్ని ఫోటోల్లో చూడటం.. వీడియోల్లో చూడటం కాదు.. అక్కడికి వెళ్లి ఆస్వాదిస్తే తెలుస్తుంది. పెద్ద పెద్ద కొండల మధ్య నుంచి జాలువారుతున్న నీళ్లు.. అచ్చం పాలలా కనిపిస్తాయి. నురగలు కక్కుకుంటూ జలజలా జారుతూ పారే నీటిని చూస్తూ మైమరిచిపోవాల్సిందే.

మీరు పైన ఫోటోలో చూస్తున్నారు కదా. అదే దూద్ సాగర్ జలపాతం. అది గోవా, కర్ణాటక సరిహద్దులో మన్ డోవి నది పైన ఉంది. దీన్నే పాల సాగర జలపాతం అని కూడా అంటారు. అంటే.. పైనుంచి జాలువారే నీళ్లు అచ్చం పాలల్లా ఉంటాయని అర్థం.

ఈ జలపాతానికి చేరుకోవాలంటే గోవా రాజధాని పనాజి నుంచి 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. లేదంటే రైలు ద్వారా కూడా వెళ్లొచ్చు. మాడ్గావన్ రైల్వే స్టేషన్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేదా బెల్గాం రైల్వే స్టేషన్ నుంచి రైలు మార్గం ద్వారా 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బెల్గాం నుంచి రోడ్డు ద్వారా వెళ్లాలంటే 55 కిలోమీటర్ల దూరం వెళ్లాలి.

దాదాపు 310 మీటర్ల ఎత్తు ఉన్న కొండల నుంచి నీళ్లు అక్కడ జాలువారుతుంటాయి. మీరు షారుఖ్, దీపికా నటించిన చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమా చూశారా? ఆ సినిమాలో దూద్ సాగర్ జలపాతం వద్ద ఓ సీన్ ఉంటుంది.

ఈ జలపాతం దగ్గర ఇంకో విశేషం ఏంటంటే… జలపాతం పారుతున్న కొండల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రెయిన్ వెళ్తున్నప్పుడు కూడా దూద్ సాగర్ జలపాతాన్ని చూసి ఎంజాయ్ చేయొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version