బ్యాచిలర్స్ మీకోసమే ‘హోలీ’ స్పెషల్ వంటకాలు.. టేస్ట్ చేయండి.. అదిరిపోవాలంతే…!

-

ఈ వంటకాలు చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా చేసేయొచ్చు. హోలీ రోజు లొట్టలేసుకుంటూ లాగించేయొచ్చు.

హోలీ పండుగ అంటేనే ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపే పండుగ. మరి… ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కు దూరంగా ఉండేవాళ్ల సంగతి. మనకు హోలీ లేదు ఏదీ లేదు. హోలీ రోజు ఎలాగూ సెలవే కదా అని గుర్రు పెట్టి నిద్రపోదామనుకుంటున్నారా? లేకపోతే ఓ 90 వేసి మన పని మనం చూసుకుందాంలే అని అనుకుంటున్నారా? తొందరపడకండి. బ్యాచిలర్స్ కూడా హోలీ పండుగ రోజును ఎంజాయ్ చేసేలా మీకోసం హోలీ స్పెషల్ వంటకాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వంటకాలు చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్ గా చేసేయొచ్చు. హోలీ రోజు లొట్టలేసుకుంటూ లాగించేయొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. బ్యాచిలర్స్ కు హోలీ స్పెషల్ వంటకాలు ఏవి సెట్ అవుతాయో తెలుసుకుందాం పదండి.

1. మెక్ కేన్స్ నగ్గెట్స్: అసలు ఈ వంటకం ఎంత సులువు అంటే మీరు ముందుగానే రకరకాల మెక్ కేన్స్ ను తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే వాటిని తినాలనిపిస్తుందో వాటిని వేడి నూనెలో వేయించి దానికి సలాడ్ యాడ్ చేసుకొని లాగించేయడమే.

2. భాంగ్ పకోడీ: దీన్నే భాంగ్ పకోరీ అని కూడా పిలుస్తారు. దీన్ని తయారు చేయడానికి మీకు కావాల్సింది భాంగ్, ఉల్లిపాయలు, గోబీ, శనగపిండి, ఉప్పు, అల్లం పేస్ట్ అంతే. భాంగ్ పకోరీ చేయడం కోసం.. పైన చెప్పిన పదార్థాలన్నీ బాగా కలిపి చిన్న చిన్న ముద్దలుగా చేసి వేడి నూనెలో వేయిస్తే చాలా భాంగ్ పకోడీ రెడీ అయినట్టే.

3. తాందాయ్: ఇది తయారు చేయడానికి తాంది, పాలు ఉంటే చాలు. తాంది అనేది భాంగ్ తో చేయబడిన పదార్థం. పాలు, తాందిని కలిపి అందులో కొంచెం ఐస్ కలిపితే చాలు.. తాందాయ్ రెడీ అయినట్టే లెక్క.

4. దహీ భల్లే: దహీ భల్లేను ఇంట్లో చేసుకోవడం కష్టమని భావిస్తున్నారా? అందుకే స్వీట్ షాప్ నుంచి భల్లే, పెరుగును తెచ్చుకొని ఫ్రిడ్జిలో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు భల్లే, పెరుగు, ఇంకా ఏవైనా కావాలంటే వాటిని మిక్స్ చేసుకోవడమే.

5. మటన్: ఈ వంటకం ఎక్కువగా నార్త్ ఇండియాలో వండుతుంటారు. సాధారణంగా మటన్ కూర ఎలా వండుతారో అలా వండితే సరిపోతుంది. లేదంటే ముందు రోజు మాంచి రెస్టారెంట్ నుంచి మటన్ కర్రీ తెచ్చుకొని ఫ్రీజ్ చేసుకోవడం బెటర్. హోలీ రోజు దాన్ని కొంచెం వేడి చేసుకొని కొంచెం అన్నం కలుపుకొని.. దానికి అదనంగా కొన్ని ఉల్లిపాయ ముక్కలు, నిమ్మ ముక్కలతో నంజుకొని తింటుంటే ఉంటుంది మజా. ఆహా.. ఎక్కడా దొరకదు అటువంటి మజా.

6. ఖీర్: ఖీర్ వండటం చాలా ఈజీ. పాలను వేడి చేసి అందులో ఒక కప్పు అన్నం వేసి బాగా కలపండి. కొంత సేపటి తర్వాత చక్కెర కలపండి. చివర్లో డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి వేసి బాగా కలపండి. అది చల్లారే దాకా ఆగండి. అంతే హోలీ స్పెషల్ గా ఖీర్ ను లాగించేయడమే.

7. లస్సీ: లస్సీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పెరుగు తీసుకోండి. దాంట్లో కొంచెం చక్కెర వేయండి. కొంచెం భాంగ్, ఉప్పు, రోజ్ వాటర్ అందులో కలపండి. ఆ మిశ్రమాన్ని బాగా కలపండి. దాంట్లో కొన్ని బాదాం ముక్కలు వేయండి. అంతే లస్సీ రెడీ.

8. వేయించిన డ్రై ఫ్రూట్స్: దీన్ని స్నాక్ ఐటమ్ గా తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ .. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ప్లాక్స్ సీడ్స్ లాంటివి ముందే కొనుక్కొని పెట్టుకోండి. పాన్ లో కొంచెం నెయ్యి వేసి కొంచెంసేపు వేయించండి. డ్రై ఫ్రూట్స్ మిక్స్ ను అందులో వేసి కాసేపు వేయించండి. ఆ మిశ్రమానికి కొంచెం ఉప్పు తగిలించండి. అంతే.. మీ హోలీ స్పెషల్ స్నాక్ ఐటెమ్ రెడీ.

9. ఫ్రైస్ చాట్: రోడ్ సైడ్ ఫుడ్ తినాలనుకునే వారిక చాయిస్ ఫ్రైస్ చాట్. పాన్ తీసుకొని ఆయిల్ పోసి వేడి చేసి.. ఫ్రైస్ ను వేడి ఆయిల్ లో వేయించండి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. మరోవైపు ఉల్లిపాయలు, టమాటాలు చిన్న చిన్నగా తరగండి. సాస్ తీసుకోండి. ఫ్రైస్ ను సాస్ లో ముంచుకొని తినేయడమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version