హైదరాబాద్ లో జీతాలు తక్కువే.. అక్కడ జీతాలు ఎక్కవ.. మనమే లాస్ట్‌

-

హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో ఉన్న వాళ్లే ఎక్కువ జీతాలను పొందుతున్నారట. వాళ్ల తర్వాత స్థానాల్లో కన్సూమర్ గూడ్స్, ఐటీ, ఇన్ ఫ్రాస్ట్రక్షర్, రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ రంగాలు ఉన్నాయి.

హైదరాబాద్… పేద, ధనిక తేడా లేకుండా.. అందరినీ అక్కున చేర్చుకొని.. ఏదో ఒక పని కల్పించే సిటీ హైదరాబాద్. దేశంలోని అన్ని మెట్రో నగరాల కన్నా చాలా చౌకైన నగరం హైదరాబాద్. అంత వరకు బాగానే ఉంది కానీ.. హైదరాబాద్ లో పని చేసేవాళ్లకు జీతాలు తక్కువేనట. మిగితా మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ లో తక్కువ జీతాలేనట. అంతంత మాత్రమేనట.

మరి.. ఎక్కువ జీతం ఎక్కడ చెల్లిస్తున్నారో తెలుసా? సిలికాన్ సిటీ బెంగళూరులో. అవును.. బెంగళూరులో పనిచేసే ఉద్యోగులు సగటున సంవత్సరానికి 10.8 లక్షల జీతాన్ని అందుకుంటున్నారట.

ఈ లెక్కలన్నీ మేం చెబుతున్నది కాదు.. రాండ్ స్టాండ్ ఇన్ సైట్స్ అనే ఓ నివేదిక తేల్చింది. బెంగళూరు తర్వాత అంతటి స్థానాన్ని సాధించింది పూణె. అవును.. పూణెలో ఉద్యోగులు సగటున 10.3 లక్షల జీతాన్ని అందుకుంటున్నారు. ఇక మూడో స్థానం ఢిల్లీది. ఢిల్లీలో 9.9 లక్షల జీతం లభిస్తోంది. ఈ మూడు నగరాల తర్వాతి స్థానంలో ముంబై ఉంది. ముంబైలో సగటు ఉద్యోగులు సంవత్సరానికి 9.2 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. చివరి స్థానంలో బిక్కుబిక్కుమంటూ ఉన్న నగరాలు.. చెన్నై, హైదరాబాద్, కోల్ కతా.

అదంతా ఓకే కానీ.. అసలు.. ఏ రంగంలో పనిచేసే వాళ్లు ఎక్కువ జీతాలను పొందుతున్నారు.. అని అడుగుతారా? అది కూడా తేల్చేసింది ఈ సంస్థ. హెల్త్ కేర్, ఫార్మా రంగాల్లో ఉన్న వాళ్లే ఎక్కువ జీతాలను పొందుతున్నారట. వాళ్ల తర్వాత స్థానాల్లో కన్సూమర్ గూడ్స్, ఐటీ, ఇన్ ఫ్రాస్ట్రక్షర్, రియల్ ఎస్టేట్, కన్ స్ట్రక్షన్ రంగాలు ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి.. ఎక్కువ జీతాలు పొందేవారిలో 6 ఏళ్ల నుంచి 10 ఏళ్ల ఎక్స్ పీరియెన్స్ ఉన్నవాళ్లే ఎక్కువగా ఉన్నారట. అది సంగతి. మరి.. మీరెక్కడ పని చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version