పాము కాటేసినా ఈ జంతువులు చావవట..! తెలుసా..?

-

పాము కాటేస్తే.. ఎలాంటి ప్రాణి అయినా చనిపోవాల్సిందే కదా..! ఒక్క చుక్క విషం తాకితే చాలు.. అంతం చేస్తుంది. అదే పాము తనను తాను కాటేసుకుంటే..ఏం కాదు. కానీ పాము కాటు వేసినా ఎలాంటి ప్రభావం చూపని కొన్ని జీవులు ఉన్నాయి తెలుసా..? జీవ శాస్త్రవేత్తల ప్రకారం, పాము విషం సాధారణంగా పాముల మధ్య నివసించే జంతువులను ప్రభావితం చేయదు. అందువల్ల అవి కాటు వేసినా ఆ జీవి చావదట. ఇంతకీ ఆ జీవులేంట్రా అనుకుంటున్నారా..?

పాము కాటు వల్ల హనీ బ్యాడ్జర్‌లు ప్రభావితం కావు. ఎందుకంటే అది ఏ పాము అయినా శరీరంలో విషం వ్యాపించదు. హనీ బ్యాడ్జర్స్ పాములను చంపి తింటాయట కూడా..!

చెక్క ఎలుక అనేది ఒక రకమైన ఎలుక, ఇది పాము విషం ద్వారా ఏమాత్రం ప్రభావితం కాదు. అయినప్పటికీ, పెద్ద పాములు తరచుగా వాటిని పూర్తిగా మింగేస్తాయి. అందుకే పాములకు దూరంగా ఉండేందుకు ఇష్టపడతాయి.

కాలిఫోర్నియా గ్రౌండ్ స్క్విరెల్ ఒక రకమైన ఉడుత. ఇది సాధారణంగా అమెరికాలోని చిన్న గడ్డి భూములు, చెట్లతో కప్పబడిన కొండలు, గ్రానైట్ రాళ్లలో కనిపిస్తుంది. పాము కాటు వల్ల ఇది కూడా ప్రభావితం కాదు

పాము పందిని కరిచినా చావదు. ఎందుకంటే దాని శరీరంలో న్యూరోటాక్సిన్ అనే ప్రత్యేకమైన రసాయనం ఉంటుంది, ఇది పాము విషాన్ని నాశనం చేస్తుంది. దానిని మరింత వ్యాప్తి చెందనివ్వదు.

పందికొక్కులా కనిపించే ముళ్ల పంది ఐరోపాలో ఉంటుంది. అయితే ఇది మన దగ్గర కూడా ఉంటుంది. చూడటానికి చిన్నగా కనిపించే ఈ జంతువు చాలా ధైర్యంగా ఉంటుంది. పాము విషం దానిపై ప్రభావం చూపదు.

ముంగిస గురించి మనందరికీ తెలుసు. ఎక్కడైనా పాము ఉంటే ముంగిసను తీసుకొచ్చి వదిలేస్తే పాము పారిపోతుందని అంటారు. ఇది పాముకు అతిపెద్ద శత్రువు. ముంగిసని కూడా పాము కాటేసినా అది చావదట.

పాపం మనుషలు ఏం పాపం చేశారో కదా..!.పాము కాటుకు మనిషిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుంది. ఏంటో లక్షల మంది పాము కాటుకు గురువుతున్నారు. మనకు కూడా అలాంటి పవర్స్‌ ఉంటే.. ఎంతో మంది ప్రాణాలు నిలబడేవి కదా.!

Read more RELATED
Recommended to you

Latest news