రిమోట్ గ్రామంలో రైతు కొడుకు, అమెరికాలో సీటు సంపాదించాడు…!

-

ప్రతిభకు పేదరికంతో పని లేదు. చదువుని ప్రేమిస్తే చాలు. ఎంతటి వారు అయినా సరే ఏ పరిస్థితిలో ఉన్నా సరే మంచి ప్రతిభ చూపిస్తూ ఉంటారు. మన చుట్టూ ఉన్న ఎందరో పేదరికం వెంటాడుతున్నా సరే చదువు విషయంలో మాత్రం భయపడే ప్రశ్నే ఉండదు. తాజాగా ఒక రైతు కొడుకు సాధించిన మార్కులు చూసి దేశం మొత్తం షాక్ అయింది.అవును రిమోట్ గ్రామంలో నివాసం ఉండే ఒక రైతు కొడుకు సిబీఎస్ఈ పరీక్షల్లో సంచలనం సృష్టించాడు. ఈ విషయాన్ని భారత అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఒక రిమోట్ గ్రామంలో రైతు కుమారుడు సిబిఎస్‌ఈ 12 వ తరగతి పరీక్షల్లో 98.2 శాతం స్కోరు సాధించి, పూర్తి స్కాలర్‌షిప్‌పై యుఎస్‌లోని ప్రతిష్టాత్మక ఐవీవై లీగ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశానికి మార్గం సుగమం చేసుకున్నాడు అని ఆయన ట్వీట్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news