న్యూమరాలజీ ప్రకారం మీ ఫోన్‌ నెంబర్‌ లక్కీనా కాదో తెలుసుకుందామా..!

-

న్యూమరాలజీ ప్రకారం మీ పేరు, పుట్టినతేదీ, వెహికల్‌ నెంబర్‌, ఫోన్‌ నెంబర్‌ అన్నీ ముఖ్యమే. వెహికల్‌ నెంబర్ తీసుకునేప్పుడు కూడా చాలా మంది ఇలా న్యూమరాలజీ చెక్‌ చేయించుకుని తీసుకుంటారు. ఈరోజు మనం సరదాగా న్యూమరాలజీ ప్రకారం మీ ఫోన్‌ నెంబర్‌ లక్కీనా కదా తెలుసుకుందాం. ఇప్పుడు తెలుసుకోని ఏం చేస్తాం మాష్టారు.. ఫోన్‌ నెంబర్‌ మార్చుకోలేం కదా అంటారేమో..! జస్ట్‌ ఫర్‌ ఫన్‌ అనుకోండి గురుగారు.

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. వినియోగిస్తున్న మొబైల్‌ నంబర్‌ ప్రభావం కూడా మనుషులపై ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నంబర్‌ని ఎంచుకుంటే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయని నిపుణులు అంటున్నారు. జీవితంలో చెడు ప్రభావాలు కూడా తగ్గుతాయని పేర్కొన్నారు. ఇప్పుడు వాడుతున్న మొబైల్‌ నంబర్‌ లక్కీనా? కాదా? ఎలా తెలుసుకోవాలంటే

లక్కీ మొబైల్ నంబర్‌ను ఎంచుకోవడం వల్ల న్యూమరాలజీ ప్రకారం.. మీకు లేదా మీ వ్యాపారానికి పాజిటివ్‌ ఎనర్జీ, ప్రయోజనాలు లభిస్తాయి. లక్కీ నంబర్‌ను సెలక్ట్‌ చేసుకోవడానికి మొబైల్‌ నంబర్‌లోని అన్ని అంకెలను.. ఒకే అంకె వచ్చే వరకు కూడుతూ ఉండాలి. చివరికి మిగిలే ఒకే ఒక్క అంకె, ఆ మొబైల్‌ నంబర్‌ మీకు అదృష్టాన్ని తెస్తుందో? లేదో? చెప్పేస్తుందట.

ఉదాహరణకు 7852619418 అనే నంబర్‌ను పరిశీలిద్దాం. దాని అదృష్టాన్ని తెలుసుకోవడానికి ముందుగా నంబర్‌లోని అన్ని అంకెలను కూడాలి. 7 + 8 + 5 + 2 + 6 + 1 + 9 + 4+ 1+8 = 58. మనకు సింగిల్ డిజిట్‌ అవసరం కాబట్టి ఫలితంలోని రెండు అంకెలు కలిపితే 5 + 8 = 13 వస్తుంది. దీని ఫలితంగా కూడా సింగిల్‌ డిజిట్‌ రాలేదు. అందులోని అంకెలను మళ్లీ కలిపితే 1 + 3 = 4 వస్తుంది. కాబట్టి మొబైల్ నంబర్‌లో చివరిగా మిగిలిన ఫైనల్ డిజిట్‌ 4.

న్యూమరాలజీలోని ప్రతి నంబర్‌ దాని సొంత లక్షణాలను కలిగి ఉంటుంది. జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు సంఖ్య 6 పోషణ, కుటుంబ ప్రాధాన్యం, కళలు, సంగీతం పట్ల ప్రశంసలు వంటి లక్షణాలతో ముడిపడి ఉంటుంది. మీ మొబైల్ నంబర్‌లోని అంకెల మొత్తం 6 వచ్చేలా సెలక్ట్‌ చేసుకుంటే, అది ఇంట్లో ఉండే తల్లులకు లేదా కుటుంబ జీవితం, కళాత్మక కార్యకలాపాలకు విలువనిచ్చే వారికి అనుకూలంగా ఉంటుంది.

బేసి సంఖ్య రాకుండా ఉండేలా చూసుకోవాలని నిపుణులు అంటుంటారు. న్యూమరాలజీలో వేర్వేరు సింగిల్-డిజిట్ నంబర్ల వివరణలను అర్థం చేసుకోవడం ద్వారా, మీ ఫోన్ నంబర్ మీకు అదృష్టమో కాదో మీరు నిర్ణయించవచ్చు. మీ మొబైల్ నంబర్‌గా సరైన నంబర్‌ను ఎంచుకోవడం వల్ల జీవితంలో సానుకూలత, విజయాన్ని పొందవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news