హర్యానాలో ప్రశాంతత ఉండేలా చూడండి : సుప్రీం కోర్ట్

-

గత మూడు రోజుల నుండి హర్యానా రాష్ట్రంలో మత ఘర్షణలు చెలరేగుతున్నాయి. వీటిని అదుపులో పెట్టడానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం నిన్న కర్ఫ్యూ విధించిన సబుగాతి తెలిసిందే. కాగా హర్యానాలో ర్యాలీ లు జరుగుతుండడంతో , వీటి వలన ఇంకా గొడవలు జరిగే ప్రమాదం ఉందని సుప్రీం కోర్ట్ లో ఒక పిటీషన్ దాఖలు అయింది. ఈ ఫిల్ పై విచారణ చేసిన సుప్రీం కోర్ట్ ధర్మశనం ఎటువంటి పరిస్థితుల్లో హర్యానాలో ప్రశాంతత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. అంతే కాకుండా రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు అస్సలు ఉండకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించింది. ఇక ఎక్కడైతే సమస్య ఉంది అని తెలుస్తుంటే అక్కడ ఎక్కువ బలగాలను పెట్టి పరిస్థితిని మన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని సుప్రీం కోర్ట్ తెలిపింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న ర్యాలీలపై నిఘా ఉంచాలని.. సీసీ కెమెరాలను పెట్టి సమస్యను గుర్తించాలన్నారు.

ఈ విషయంపై తగిన విధంగా చర్యలు తీసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని హర్యానా, ఢిల్లీ, యూపీ, కేంద్రం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news