యుద్ధం ప్రకటించిన ఫ్రాన్స్.. ఎవరి మీదో తెలిస్తే షాక‌వ్వాల్సిందే..!

-

ఫ్రాన్స్ దేశం యుద్ధం ప్రకటించింది. అవును! మీరు విన్న‌ది నిజ‌మే. కానీ ఈ సంగ్రామం మరో దేశం మీదో లేక ఉగ్రవాద సంస్థ మీదో కాదు. అడ్డూ ఆపూ లేకుండా పెరుగుతున్న నల్లుల మీదే ఈ పోరు. యూరప్ లో ఉన్న అందమైన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అడుగడుగునా ప్రకృతి రమణీయతతో విలసిల్లే ఈ దేశం ఇప్పుడు అనుకోని అతిథితో సతమతమవుతోంది. ఎన్నడూ లేనంతగా నల్లులు ఫ్రాన్స్ దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఏకంగా ఎమర్జెన్సీ ప్రకటించాల్సి వచ్చిందంటే నల్లులు ఏ స్థాయిలో విజృంభించాయో అర్థం చేసుకోవచ్చు. ఓ నల్లి మంచంలో చేరిందంటే అది పెట్టే బాధ అంతా ఇంతా కాదు. మంచాలు, కుర్చీలు, సోఫాలు, టేబుళ్లు… ఇలా నల్లి ప్రవేశానికి కాదేదీ అనర్హం అన్నట్టుగా తయారైంది.

దాంతో ఫ్రెంచ్ ప్రభుత్వం నల్లులపై యుద్ధం ప్రకటించింది. అప్పట్లో రెండో ప్రపంచయుద్ధం తర్వాత డీడీటీ రసాయనం వినియోగంతో నల్లుల బెడద తొలగిపోయింది. ఆ తర్వాత కాలంలో డీడీటీని నిషేధించడంతో నల్లులకు అడ్డంకి తొలగిపోయింది. ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయి ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. దాంతో నల్లుల నిర్మూలన కోసం 100 రోజుల కార్యాచరణ రూపొందించారు. ఓ టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించారు. పేదవారికి నల్లుల నిర్మూలన మందులు ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు.

Read more RELATED
Recommended to you

Latest news