అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. రేయ్.. ఎవడ్రా అది. ఇంకా ఏకాలంలో ఉన్నారు.. ఇది త్రేతాయుగం కాదు కలియుగం.. ఇప్పుడు అంతా నెట్‌మయం.. స్మార్ట్‌ఫోన్లమయం.. ఈ జగమంతా ఆన్‌లైన్‌మయం.. అని పాడుకోవాలి. ఎందుకంటే ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఇంట్లోనే కూర్చొని ఉప్పుతో సహా అన్ని రకాల వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకొనే వెసులుబాటు వచ్చేసింది మనకు. స్మార్ట్‌ఫోన్‌తోనే ప్రపంచాన్ని చుట్టొస్తున్నాం. అందుకే.. ఆ స్మార్ట్‌ఫోన్, ఆన్‌లైన్ అనే కాన్సెప్ట్‌ను బాగా వాడుకున్న ఓ వ్యక్తి ఏకంగా గణేశుడి పూజకు కావాల్సిన సామాగ్రి కోసం ఓ ఈకామర్స్ సైట్‌ను స్టార్ట్ చేశారు.
అవును.. చాలామంది వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేస్తారు. కానీ.. వినాయకుడి పూజకు కావాల్సిన అన్ని సామాన్లు కొంతమందికి దొరకవు. దొరికినా.. మూడునాలుగు షాపులు తిరగాలి. విగ్రహం కొనాలి.. సామాన్లంటికీ తిరగాలంటే చిరాకే కదా. అందుకే.. ఆరాధ్యకిట్ అనే ఓ సంస్థ ఈకామర్స్ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అందులో మీకు వినాయకుడి విగ్రహంతో పాటు 21 రకాల పత్రులు, 18 రకాల పూజా సామాగ్రితో ఉన్న కిట్‌ను మీ ఇంటికే డెలివరీ చేస్తారు. జస్ట్ మీరు www.aaradhyakit.com అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అయి.. ఆర్డర్ బుక్ చేసుకుంటే సరి. అయ్యబాబోయ్.. ఎంత వీజీగా ఉంది ఈ ప్రాసెస్. ఒకే ఒక్క క్లిక్‌తో ఇంటికి వినాయకుడి పూజ సామాన్లు వస్తాయంటే ఎవరూరుకుంటారు. అందులో చీఫ్ అండ్ బెస్ట్ రేట్‌లో.. వారేవా.. ఈ ఐడియా వచ్చిన వ్యక్తికి దండం పెట్టాలి నిజంగా.