కరోనా వ్యాక్సిన్, టాయిలెట్ పేపర్… అన్నింటినీ కేకుల్లోకి తెచ్చేసిన జర్మనీ బేకరీ..

-

మహమ్మారి కారణంగా ప్రపంచమంతా స్తంభించిపోయింది. 2020పూర్తిగా కరోనా నామ సంవత్సరంగా మారిపోయింది. ప్రస్తుతం 2021లో ఉన్నాం. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతున్నాయి. 2020లో మూతబడినవన్నీ మెల్ల మెల్లగా తెరుచుకుని వాటి పాత కళని తిరిగి తెచ్చుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్ కూడా వచ్చేసింది. చాలా దేశాల్లో ఫ్రంట్ లైన్ వర్కర్లకి వ్యాక్సిన్ ఇస్తున్నారు. మనదేశంలోనూ వ్యాక్సిన్లకి ప్రభుత్వ అమోదం లభించింది. మరికొద్ది రోజుల్లో వ్యాక్సిన్ పంపిణీ మొదలవనుంది.

ఈ నేపథ్యంలో ప్రతీ చోటా సంబరాలు మొదలయ్యాయి. వ్యాక్సిన్ తెచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో జర్మనీకి చెందిన ప్రముఖ బేకరీ, వినూత్న ప్రయోగాన్ని చేసింది. వ్యాక్సిన్ వచ్చిన ఆనందంలో దాన్ని నలుగురితో పంచుకోవడానికి సరికొత్త ప్రయోగాన్ని చేసింది. టీకా ఇచ్చే సిరంజి ఆకారంలో కేక్ తయారు చేసి అమ్మకానికి పెట్టింది. దానిమీద 2021 అని రాసి, బై బై కరోనా అని రాసింది.

ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆ ఆనందాన్ని ఇలా వినూత్నంగా పంచుకున్నారు. జర్మనీ బేకరీ ఇలా చేయడం కొత్త కాదు. గతంలో వెస్ట్రన్ టాయిలెట్స్ లో వాడే పేపర్ మాదిరి కేకులు తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ ఫోటోలూ ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

తమ వినియోగదారులకి వినూత్నమైన అనుభూతిని అందించడానికి ఇలా సరికొత్త ఐడియాలతో ముందుకు వస్తామని, బేకరీ యాజమాన్యం వెల్లడించింది. మరి ముందు ముందు మరెన్ని కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారో చూడాలి. ప్రస్తుతానికి కరోనా వైరస్ కి వ్యాక్సిన్ ఇచ్చే సిరంజి కేక్ చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news