అమ్మయీలూ పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే ఇవి తప్పక తెలుసుకోవాలి..!

-

అమ్మయీలూ పెళ్లికి రెడీ అవుతున్నారా..? అయితే కచ్చితంగా ఇది మీరు తెలుసుకోవాలి. పెళ్లి ఫిక్స్ అవ్వగానే అమ్మాయి కొన్ని వాటికి రెడీగా ఉండాలి. పెళ్లి సమయంలో ముఖాన్ని అందంగా ఉంచుకోవడం, మానసికంగా దృఢంగా ఉండడం చాలా అవసరం. అయితే పెళ్లికి మీ ముఖం బాగుండాలన్నా, హెల్దీగా ఉండాలన్నా వీటిని ఫాలో అవ్వండి. మెరిసే చర్మం కోసం రోజూ హైడ్రేట్ గా ఉండాలి. ఉదయాన్నే వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవద్దు. పెళ్లి సమయంలో జాగ్రత్తగా ఉండాలి ఫాస్ట్ ఫుడ్ ని తీసుకోవడం వలన ఇబ్బందులు రావచ్చు. ఫాస్ట్ ఫుడ్ ని తినకండి. పండ్లు తినడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వండి.

అలాగే రోజుకి 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడానికి చూసుకోండి. ఎక్కువసేపు నిద్రపోతే మానసిక ఆరోగ్యం మెరుగుపయడమే కాకుండా చర్మం కూడా బాగుంటుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి యోగా చేస్తూ ఉండండి. యోగా చేయడం వలన ఒత్తిడి తగ్గుతుంది. అనేక ఇబ్బందులు నుంచి దూరంగా ఉండవచ్చు. పెళ్లి కుదిరిన తర్వాత వ్యాయామం చేస్తూ ఉండండి. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండవచ్చు. శరీరం ఆకర్షణంగా కూడా ఉంటుంది.

శనగ పిండిలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే చర్మం బావుంటుంది. మెరిసిపోతుంది. ఇదే కాకుండా ఇంకా ఇంటి చిట్కాలను మీరు ప్రయత్నం చేయొచ్చు. తేమ కోసం కీరా దోస ముక్కలు, డార్క్ సర్కిల్స్ కోసం బంగాళదుంప ముక్కలు వంటివి ట్రై చేయొచ్చు. అలాగే జుట్టుని కూడా అందంగా హెల్తీగా ఉంచుకోండి. మంచి హెయిర్ స్టైల్స్ ని వేసుకునేటప్పుడు హెయిర్ బాగుండాలి. కాబట్టి జుట్టుని ఒత్తుగా పెంచుకోవడానికి సరైన హెయిర్ కేర్ ని ఫారో ఫాలో అవ్వండి. పెళ్లి కుదిరిన తర్వాత వీటిని ఫాలో అయ్యారంటే హెల్తీగా ఉండడమే కాకుండా అందంగా ఉండవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news