మహిళలకు మంచి వ్యాపార అవకాశం… ఇంట్లో ఉంటూనే..

ఎవరు ఎన్ని చెప్పినా సరే… మహిళలకు ఫ్యాషన్ ఎక్కువైంది అనేది వాస్తవం. ప్రతీ చిన్న విషయంలో కూడా వాళ్ళు నేడు ఫ్యాషన్ చూస్తున్నారు. ముఖ్యంగా దుస్తులు, జుట్టు విషయంలో వాళ్ళు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సింపుల్ గా ఉన్నామనిపిస్తునే సరికొత్తగా కనపడే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. పెళ్ళిళ్ళు, చిన్న చిన్న ఫంక్షన్ల మీద ఎక్కువగా దృష్టి పెట్టి దుస్తులను కుట్టిస్తున్నారు. చీర నుంచి బ్లౌస్ వంటి వాటి విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతూ పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో మహిళలు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పుడు దీనినే మంచి వ్యాపారంగా మలుచుకోవచ్చు అంటున్నారు నిపుణులు. గ్రామాల్లో ఇప్పుడు ఎక్కువగా మహిళలు సింపుల్ గా ఉండే ఫ్యాషన్ మీద దృష్టి పెడుతున్నారు అనేది వాస్తవం. చీరలకు వర్క్, బ్లౌజ్ కి వర్క్ చేయించడం ఎక్కువగా చేయిస్తున్నారు. ఇందుకోసం వాళ్ళు పట్టణాల మీద ఆధారపడుతున్నారు. ఉదాహరణకు వరంగల్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం అయితే వాళ్ళు వరంగల్ వెళ్లి చేయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరే గ్రామంలో ఒక మిషన్ పెడితే, నిపుణులను నియమించుకుని కుట్టిస్తే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు.

ఉదారణకు ఒక బ్లౌజ్ కుట్టినందుకు 100 రూపాయలు తీసుకుంటే… కుట్టిన వ్యక్తికి అందులో 30 నుంచి 40 శాతం ఇస్తూ మిగిలినది మీరు తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని అంటున్నారు. ఇక మీరు వర్క్ విషయంలో క్వాలిటి చూపిస్తే నోటి ప్రచారం వేగంగా జరిగి మీ వ్యాపారం దూసుకుపోతుందని అంటున్నారు. చాలా మంది ఒక్కో బ్లౌజ్ కి 3 నుంచి 4 వేల వరకు ఖర్చు చేస్తున్నారు కాబట్టి మీరు గ్రామాల్లోనే ఈ వర్క్ మొదలుపెడితే మంచి వృద్ది ఉంటుందని సూచిస్తున్నారు.

గ్రామాల్లో ఎక్కువగా కాళీ గా ఉండే అమ్మాయిలూ కనపడుతూ ఉంటారు.  వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించి ఇలాంటి వ్యాపారాలు మొదలుపెడితే వారికీ కూడా ఉపాధి ఉన్నట్టు ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. అటు పట్టణాలకు వెళ్లకుండా ఆ వ్యాపారాన్ని తమ వైపుకి తిప్పుకోవడానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా అందించాలని, దానితో సిటీ వైపు చూసే వాళ్ళ సంఖ్యా తగ్గుతుందని సూచిస్తున్నారు.