కరోనా వైరస్ నేడు ప్రపంచాన్ని వణికిస్తోన్న పేరు. ఇప్పుడు ఇండియాలో కూడా క్రమక్రమంగా విస్తరిస్తోంది. తొలుత ఈ వైరస్ బారిన పడ్డ వ్యక్తిని కేరళలో గుర్తించారు. కొద్ది రోజులకే వారికి నయం కావడంతో కేరళలో కరోనా ప్రభావం తగ్గిందని అందరూ అనుకున్నారు. కానీ మళ్ళీ కేరళలో కరోనా పడగ విప్పుతోంది..
మరోె ఐదుగురికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించారు. ఇటలీ నుంచి వచ్చిన ముగ్గురికి కరోనా వచ్చిందని వారి కుటుంబ సభ్యులైన మరో ముగ్గురికి ఈ వ్యాది సోకినట్టు మంత్రి వెల్లడించారు. ఇటలీ నుంచి వచ్చిన వారు ఎలాంటి సమాచారం అందించలేదని, ప్రస్తుతం వారిని ఐసోెలేషన్ వార్డుకు తరలించి చికిత్స చేస్తున్నామని తెలిపారు…
కాగా ఈ ఐదు కేసులతో కలిపి దేశంలో ఇప్పటి వరకూ 39 మందికి కరోనా వైరస్ సోకినట్టు లెక్కలు తేలాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనాను అడ్డుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.