టాటా కార్ల క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్‌న్యూస్‌.. క‌ష్ట‌కాలంలో కాస్త ఊర‌ట‌

-

క‌రోనా దెబ్బ‌కు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయింది. స‌గ‌టు మ‌నిషి కొనుగోలు శ‌క్తి దారుణంగా ప‌డిపోయింది. కొత్త‌గా కారు కాదు క‌దా బైక్ కూడా కొన‌లేని ప‌రిస్థితి. ఇలాంటి క‌ష్ట స‌మ‌యంలో టాటా మోటార్స్ వారు త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 31వ‌ర‌కు ఉన్న కార్ల వారంటీని, ఫ్రీ స‌ర్వీసుల గ‌డువును జూన్ 30వ‌ర‌కు పొడిగించింది.

ప్రస్తుతం కరోనాకార‌ణంగా ఇబ్బందుల్లో ఉన్న క‌స్ట‌మ‌ర్ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్న‌ట్టు సంస్థ తెలిపింది. త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కంటే త‌మ‌కు ఏదీ ఎక్కువ కాద‌ని వివ‌రించింద‌.

నిర్వాహ‌కురాలు మెహ‌తా ఈ విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. మా క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ క‌ఠిన స‌మ‌యంలో కొంతైనా మేలు చేకూరేలా ఏప్రిల్ 30నుంచి మే 30లోపు ముగిసే వాంర‌టీ, ఫ్రీ స‌ర్వీసుల‌ను జూన్ 30వ‌ర‌కు పొడిగించామ‌ని వివ‌రించారు. త‌మ సంస్థ‌కు దేశ‌వ్యాప్తంగా 608స‌ర్వీస్ సెంట‌ర్లు ఉన్న‌ట్టు వివ‌రించారు. అవ‌స‌ర‌మైతే మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తామ‌ని ఆమె స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news