భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

-

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి ఎక్కువ మంది ఇళ్లల్లో మనం చూస్తున్నాం.

అయితే ఆరోగ్య పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కుటుంబ సమస్యలు కానీ ఇలా ఏ సమస్య అయినా సరే సులువుగా పరిష్కరించుకోవడానికి పండితులు గొప్ప ఉపాయాన్ని చెప్పారు. మరి దాని కోసం ఇప్పుడు చూద్దాం.

ఇటువంటి సమయం లో మీరు సమస్యలనుంచి దూరంగా, ఆనందంగా ఉండాలంటే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ”ఓ కృష్ణ ద్వారకవాసిన్ క్వాసి యాదవనందం. అద్భివః: పరిభూతం మా త్రియాశ్వశు జనార్దనా”. మీరు దీన్ని నమ్మకం తో మనస్ఫూర్తిగా చేయండి తప్పకుండా శ్రీకృష్ణుడు మీ మొర ఆలకిస్తాడు.

అదే విధంగా భయాలు అనారోగ్య సమస్యలు ఉంటే ఈ మంత్రాన్ని చదవండి. ”ఓం నమో భగవతే తస్మై కృష్ణాయ కుంఠమేధసే… సర్వవ్యాధి సర్వయదివినాశాయ ప్రభో మామమృతం కృద్ధీ” ప్రతి రోజు ఈ మంత్రాన్ని మూడు సార్లు చదవండి. ఉదయం లేచిన వెంటనే దీనిని చదివితే తప్పకుండా అనారోగ్య సమస్యలు మరియు భయాలు తొలగిపోతాయి.

ఆనందం కోసం మరియు అదృష్టం కోసం ”ఓం నమో భగవతే శ్రీ గోవిందాయ” అని ప్రతి రోజూ చదువుకోండి. ” కృష్ణ కృష్ణ నమః” అని జపించడం వల్ల ఇబ్బందులు ఉండకుండా ఆనందంగా శాంతంగా ఉండొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news