నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలు గాంధీ వేషధారణతో అలరించారు. 5500 మంది చిన్నారులు గాంధీ వేషం వేసుకొని ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఈ అరుదైన ఘట్టానికి నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వేదికయింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రదర్శనలో భాగంగా రఘుపతి రాఘవ రాజారాం అనే పాటను ప్లే చేశారు. ఆ పాట ప్లే అవుతున్నంత సేపు బాల గాంధీలంతా అలాగే కదలకుండా నిల్చున్నారు. దీంతో సరికొత్త రికార్డును వాళ్లు క్రియేట్ చేశారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధులు దీన్ని ప్రపంచ రికార్డుగా ప్రకటించారు.
ఇదివరకు 2015 లో బెంగళూరులో ఇలాగే బాల గాంధీలతో ప్రదర్శన నిర్వహించారని.. అయితే వాళ్లు కేవలం 4605 చిన్నారులతో మాత్రమే ప్రదర్శన నిర్వహించారని.. ఆ రికార్డును ఈ రికార్డు తిరగరాసిందని ప్రతినిధులు తెలిపారు.