2.ఓ మరో మేకింగ్ వీడియో

-

శంకర్, రజినికాంత్ కాంబినేషన్ లో వస్తున్న 2.ఓ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ లో రిలీజ్ కానుంది. ఈమధ్యనే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. రజినికాంత్, అమీ జాక్సన్ తో పాటుగా సినిమాలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ కూడా 2.ఓలో నటిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 500 కోట్ల పైగా బడ్జెట్ కేటాయించిన ఈ సినిమా మేకింగ్ వీడియో ఆడియెన్స్ ను థ్రిల్ అయ్యేలా చేస్తున్నాయి.

ఇప్పటికే మేకింగ్ వీడియో స్నీక్ పీక్ అంటూ వచ్చిన 3 పార్టులు ప్రేక్షకులను అలరించగా.. ఈరోజు 2.ఓ మరో మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే సినిమా ఎంత గొప్పగా వస్తుందో తెలుస్తుంది. దాదాపు వెయ్యి మంది వి.ఎఫ్.ఎక్స్ నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని స్టూడియోస్ కు వెళ్లి వారిని ఎంచుకున్నారు. మేకింగ్ వీడియో చూస్తేనే సినిమా మన ఆడియెన్స్ కు ఓ హాలీవుడ్ మూవీ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ 2.ఓ సినిమా సంచనాలకు కేంద్ర బిందువుగా మారుతుందో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version