గ్రహాంతరవాసిలా కనిపించేందుకు ముక్కు, చెవులు తీయించేసుకున్నాడు..!

-

సాధారణంగా ఎవరైనా కాస్త వైరైటీగా ఉంటే.. వీడేంట్రా గ్రహాంతరవాసిలా ఉన్నాడు అని మనం జోకులు వేసుకుంటాం.. కానీ ఒక వ్యక్తి కావాలనే గ్రహాంతరవాసిలా కనిపించాలని ఒళ్లంతా టాటూలు వేయుంచుకున్నాడు. అతని పేరు ఆంథోనీ లోఫ్రెడో.. బంగారం లాంటి శరీరాన్ని భయంకరంగా మార్చుకున్నాడు. అసలు ఇలాంటి థాట్స్‌ ఎలా వస్తాయ్‌.?

గ్రహాంతరవాసుల గురించి అనేక అపోహలు ఉన్నాయి. అంతరిక్షంలో భూమితో పాటు ఇతర గ్రహాలపై కూడా జీవించి ఉండవచ్చని కొందరు అంటుంటారు. కొందరి అభిప్రాయం ప్రకారం.. అది సాధ్యం కాదనే వాదన కూడా ఉంది. ఏలియన్స్‌ ఉన్నాయో లేదో తెలియదు కాని..అలాంటి మనిషి మాత్రం ఉన్నాడు. ఏలియన్స్‌తో ప్రయోగాలు చేసే శాస్త్రవేత్తలకు కొదవేలేదు. అయితే గ్రహాంతర జీవులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. కాని అలాంటి మానవరూపం మాత్రం ఒకటి వైరల్ అవుతోంది.

ప్రపంచంలోనే ‘బ్లాక్ ఏలియన్’ గురించి మాత్రం కొత్తగా కథనాలు వస్తున్నాయి. బ్లాక్ ఏలియన్‌గా పిలవబడే ఆ వికృతరూప మనిషి అసలు పేరు ఆంథోనీ లోఫ్రెడో. ఇతను మనిషే అయినప్పటికి రూపం కారణంగా ఫ్రెంచ్ వారికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. 28సంవత్సరాల ఆంథోనీ లోఫ్రెడో తన అభిరుచి కోసం ఎన్నో బాధలు, లెక్కకు మించిన గాయాలను భరిస్తూ.. కేవలం తాను గ్రహాంతరవాసిలా కనిపించేందుకు శరీరం అంతా టాటూలు వేయించుకున్నాడు.

తనను తాను గ్రహాంతర వాసిగా మార్చుకునేందుకు ఆపరేషన్‌ల ద్వారా ముక్కు, చెవులు, రెండు వేళ్లను తొలగించుకున్నాడు.. అయితే ఇంత జరిగినా మనోడు శాటిస్‌ఫై కాలేదు.. పూర్తి స్థాయిలో ఏలియన్‌గా ఉండాలని ఫిక్స్‌ అయ్యాడు. లోఫ్రెడో తన కనుబొమ్మల రంగును చాలాసార్లు మార్చాడు. అలాగే అతని దంతాలు పదునుపెట్టడమే కాకుండా ఊదా రంగులో “నల్ల గ్రహాంతర వాసి” దంతల్లా మార్చుకున్నాడు.

చక్కగా ఉన్న శరీరాన్ని ఏలియన్‌గా మార్చుకునేందుకు ఆంథోనీ తన శరీరం మీద లెక్కలేనంత డబ్బు ఖర్చు చేశాడు.. టాటూలు, సర్జరీల కోసం ఇప్పటి వరకు ఇండియన్‌ కరెన్సీలో 24 లక్షలకు పైగా ఖర్చు చేశాడట. ఒక మనిషి గ్రహాంతవాసిలా కనిపించడానికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయడమే కాకుండా..శరీరాన్ని అంతగా బాధపెట్టడంలో అతనికి ఏం సరదా అని నెటిజన్లు అంటున్నారు..కొందరైతే ఇలాంటి వాళ్లను జనం మధ్యలో రానివ్వకపోవడమే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎవరేమి అనుకున్నా..ఆంథోనీ మాత్రం ఇవేమి పట్టించుకోను అంటున్నారు.

అయితే ఇంత వికృత రూపం కొని తెచ్చుకున్న ఆంథోనీ లోఫ్రోడోర్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని అప్‌డేట్స్ ఫాలో అవుతూ నెటిజన్లు తిడుతుంటారు.. ఎవరెన్ని విమర్శలు చేసినా తాను మాత్రం ఈ గ్రహాంతరవాసి రూపంలో చాలా హ్యాపీగా ఉన్నాడట.. ఇదేం ఆనందంరా బాబు.. మన దగ్గర అయితే.. అసలు ఇలా ఉంటే పెళ్లిళ్లు అవుతాయా..? కుక్కలు కూడా ఊరుకోవు అంటారేమో కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version