పోలీస్ స్టేషన్ గా హిట్లర్ ఇల్లు

ఆస్ట్రియా దేశం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జర్మని నియంత అడాల్ఫ్ హిట్లర్ పుట్టిన ఇంటిని పోలీస్ స్టేషన్ గా మార్చాలని ఆదేశం భావిస్తుంది. అక్కడికి హిట్లర్ మద్దతు దారులు పదే పదే వస్తున్నారు అని అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని వాళ్ళను రాకుండా ఆపుతామని ఆ దేశ ప్రభుత్వ౦ పేర్కొంది. ఇటీవల ఆస్ట్రియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ మూడు అంతస్థులు ఉండే ఆ భవంతికి నూతన డిజైన్ల కోసం పోటీ నిర్వహించింది.

దాదాపు 11 మంది ఆర్కిటెక్టు సంస్థలు పాల్గొని… మార్టే అనే సంస్థ విజేతగా నిలవగా… ఇంటిని పోలీస్ స్టేషన్‌గా మార్చే ప్రణాళికలను ఈ సంస్థే సిద్దం చేసింది. దీనిపై ఆ దేశంలో కొన్నేళ్ళ నుంచి చర్చలు జరుగుతున్నాయి. బ్రోనోవ్ ఆన్ ఇన్ అనే ప్రాంతంలో అది ఉంది. అయితే యజమాని ఎవరు అనేది మాత్రం ఇప్పటి వరకు స్పష్టత లేదు.దీనిపై కొంత కాలం వివాదం నడవగా ఆ దేశ సుప్రీం కోర్ట్ 2017లో ముగింపు కార్డు వేసింది.

ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి అసలు యజమాని ముదుకు రాకపోతే ప్రభుత్వమే దీన్ని తన ఆధీనంలోకి తీసుకుని ప్రజల కోసం వాడుకోవచ్చు అని చెప్పింది. అదే సమయంలో కొందరు భవనం కూల్చి వెయ్యాలి అనే డిమాండ్ కూడా చేఆరు. పోలీస్ స్టేషన్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పోలీస్‌స్టేషన్‌తో పాటూగా ప్రాంతీయ కంమేండ్ కూడా ఆ భవంతిలో ఏర్పాటు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.