ఈ నీలి రంగు గెలాక్సీ ఎంత అందంగా ఉంది : నాసా

-

గెలాక్సీలో ఎంతో వింతలు చోటు చేసుకుంటాయి. వాటిని చూడాలని అందరూ ఎంతో ఆతురతగా ఎదురు చూస్తుంటారు. ఇటీవల అంగారక గ్రహంపై అడుగు పెట్టిన నాసా.. ల్యాండింగ్ సమయంలోనే ఓ ఆడియోను కూడా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా ఓ గెలాక్సీ ఫోటోను విడుదల చేసింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ వచ్చాయంటే మీరే అర్థం చేసుకోండి.. ఆ ఫోటో ఎంత ప్రత్యేకమో. నాసా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో తరచూ అంతరిక్షంలోని ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది. పోస్ట్ చేసిన ప్రతి ఫోటో నెటిజన్లకు ఆశ్చర్యపరిచేలా ఉంటాయి. కేస్ ఇన్ పాయింట్ (ఎన్‌జీసీ-2336)గా పిలువబడే ఓ గెలాక్సీ ఫోటోను అంతర్జాతీయ పరిశోధన సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతోపాటు ఈ గెలాక్సీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.

గెలాక్సీ

100 మిలియన్ల లైట్ ఇయర్స్‌కు దూరంలో ఉన్న ఈ గెలాక్సీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘‘నీలి రంగులో ఎంత పెద్దగా.. ఎంత అందంగా ఉంది.’’ అని నాసా పేర్కొంది. ఈ గెలాక్సీని మొట్టమొదటి సారిగా జర్మన్ ఖగోళ శాస్త్రవేత్త విల్హెల్మ్ టెంపల్ 0.28 మీటర్ల (11 అంగుళాలు) టెలిస్కోప్‌ను ఉపయోగించి కనుక్కొన్నారు. ఎన్‌జీసీ-2336 అనేది క్వింటెన్షియల్ గెలాక్సీ, ఇది 2,00,000 లైట్ ఇయర్స్‌ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఈ ఫోటో ఎంతో అందంగా ఉందని.. చూడటానికి రెండు కళ్లు చాలడం లేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఫోటోను చూసినట్లయితే ఎరుపు రంగు, బూడిద రంగు, నీలి రంగు మిశ్రమంతో కలగలసి ఉందని, మధ్య మధ్యలో చిన్న చిన్న నక్షత్రాలు నీలిరంగులో మెరుస్తున్నాయని, యువ నక్షత్రాలతో ఎన్‌జీసీ-2336 ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తోందని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. గెలాక్సీ మొక్క ఎర్రటి కేంద్ర భాగం పాత నక్షత్రాలతో మెరిసిపోతోందని చెప్పుకొచ్చారు. నాసా పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఫోటో చూసిన నెటిజన్లు ఎంత అందంగా ఉందంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version