ఎయిర్ హోస్టస్ గా పని చేసే వాళ్ళకి మంచి జీతాలతో పాటుగా ఇతర దేశాలకు ట్రావెల్ చేసే అవకాశాన్ని కూడా ఇస్తారు. చాలా మందికి ఎయిర్ హోస్టస్ అవ్వాలంటే ఏం చదువుకోవాలి..? అర్హత వంటి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. మీరు కూడా తెలుసుకోవాలంటే ఇప్పుడే చూసేయండి. అసలు ఎయిర్ హోస్టస్ కి ఎంత శాలరీ ఇస్తారు అని దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఎంట్రీ లెవెల్ ఎయిర్ హోస్టస్ కి భారతదేశంలో ఐదు లక్షల నుంచి తొమ్మిది లక్షలు సంవత్సరానికి చెల్లిస్తారు. అదే వారికి మూడేళ్ల అనుభవం ఉన్నట్లయితే లక్ష నుండి లక్షన్నర వరకు నెలకు చెల్లిస్తారు.
ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ ఎక్కువ ప్యాకేజీలని అందిస్తున్నాయి. పైగా వారికి జీతంతో పాటుగా ఇతర బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ట్రావెల్ అలోవెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటివి కూడా అందిస్తున్నాయి.
అర్హత, స్కిల్స్:
ఎయిర్ హోస్టస్ కింద అప్లై చేయాలనుకుంటే ఇంటర్ 55%తో ఉత్తీర్ణత అవ్వాలి. ఆ తర్వాత ఎయిర్ హోస్సెస్ ట్రైనింగ్ ని రెండు ఏళ్ళ పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, హిందీ భాషలు వచ్చి ఉండాలి. ఏమైనా ఫారెన్ భాషలు వస్తే మరింత ప్లస్ అవుతుంది.
వయస్సు వివరాలు:
ఇక వయసు విషయానికి వస్తే 17 ఏళ్లు కనీసం ఉండాలి. మాక్సిమం 26 ఏళ్లు ఉండాలి. కొన్ని ఎయిర్లైన్స్ లో అయితే 30 ఏళ్లు దాటినా కూడా తీసుకుంటారు.
ఫిజికల్ రిక్వైర్మెంట్స్:
కనీస ఎత్తు 5.5 అడుగులు ఉండాలి. బరువు 55 నుంచి 60 కేజీలు ఉండాలి. హెల్దీ డైట్, చూడడానికి ఆకర్షించేలా ఉండాలి.