బెట్టింగ్ యాప్స్ కేసు.. ప్రమోటర్లకు రూ.50 లక్షల జరిమానా?

-

బెట్టింగ్ యాప్స్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో హైకోర్టు న్యాయవాది కృష్ణకాంత్ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA)కి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీసీపీఏ ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సీసీపీఏ చర్యల ప్రకారం.. ఈ యాప్స్ ను ప్రమోట్ చేసిన ప్రముఖులు మూడేళ్ల పాటు యాడ్స్ చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. మరోవైపు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వారికి జరిమానా విధించే అవకాశం కూడా ఉన్నట్లు తెలిసింది.

“బెట్టింగ్ యాప్స్ కు యువత పెద్ద ఎత్తున ఆకర్షితులవుతూ వ్యసనానికి గురవుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయి రోడ్డున పడుతున్నారు. కొందరు అప్పులు కట్టలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సెలబ్రిటీలు వీటికి ప్రచారం చేయడం వల్ల ఆ యాప్స్ కు విశ్వసనీయత లభిస్తోంది. ఫలితంగా అధిక సంఖ్యలో యువత వీటి బారిన పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. అందుకే దీన్ని అడ్డుకోవాల్సి ఉంది.” అంటూ న్యాయవాది కృష్ణ కాంత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సీసీపీఏ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది

Read more RELATED
Recommended to you

Exit mobile version