పెట్రోల్ మోసాల గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే అవుతుంది. వినియోగదారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే బంకులు మోసం చేస్తూనే ఉంటాయి. వంద రూపాయల పెట్రోల్ కొట్టిస్తే మనకు వచ్చేది 90 రూపాయలదో లేక 80 రూపాయలదో ఉంటుంది. ధరలు పెరగడంతో ఇప్పుడు ఈ మోసాలు మరీ ఎక్కువైపోయాయి. గతంలో మోసం చేసే విషయంలో సరైన అవగాహన లేని యాజమాన్యాలు ఇప్పుడు నూతన పద్దతులను అనుసరిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయి. దీనితో చాలా మంది ఇపుడు ఆయిల్ కొట్టించాలి అంటే భయపడిపోతున్నారు…
వాళ్ళు ఎంత కొడుతున్నారో కూడా మనకు అర్ధం కాదు ఒక్కోసారి… పైన ముల్లు చూపిస్తుంది కదా అనే భ్రమలో ఉంటాం. అయితే ఈ మోసాలను అరికట్టడానికి లేదా వాటి నుంచి తప్పించుకోవడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు… అది ఎలాగో ఒకసారి చూద్దాం… పెట్రోల్ కొట్టించే సమయంలో వంద రూపాయలు, రెండో౦దలు కొట్టించకుండా… 210, 110 ఇలా కొట్టించమని చెప్తున్నారు. కొంత మంది బంకు యజమానులు… అతి తెలివితో… వంద రూపాయలకు ఆయిల్ కొడితే ఇంత రావాలి, 200 లకు కొడితే ఇంత రావాలని ముందే సెట్ చేసి ఉంచుతారట.
అప్పుడు మనం ఒక అడుగు ముందుకి వేసి… ఆయిల్ కొట్టించే సమయంలో 100కు, లేదా 200లకు 10 లేక 12 రూపాయలో ఎక్కువ కొట్టించాలని సూచిస్తున్నారు. ఇక అనుమానం ఉంటె బాటిల్ తీసుకుని వెళ్లి నింపుకోవడం ఇంకా మంచిదని అంటున్నారు. ఇక ఎక్కువ మొత్తంలో కొట్టించే వారు ఫుల్ ట్యాంక్ చేయించడం ఉత్తమ౦ అంటున్నారు. తద్వారా మనకు బండిలో ఎంత ఆయిల్ నిండుతుందో ఒక అవగాహన ఉంటుందని… ప్రశ్నించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. రీడింగ్ చూసినా మోసం చేస్తుంటే ఈ సలహాలు ఎంత వరకు ఫలిస్తాయో…