అప్పుడప్పుడు హోటల్స్ లో స్టే చేసినప్పుడు లేదంటే బయట వాష్ రూమ్స్ ని ఉపయోగించేటప్పుడు హిడెన్ కెమెరాలు ఉన్నాయేమో అని డౌట్ ఉంటుంది. అయితే నిజంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేయాలంటే ఇలా చేయొచ్చు. కెమెరాకి సంబంధించిన వైర్లు ఎంత బాగా దాచిపెట్టినా కూడా లెన్స్ మాత్రం బయటకు కనబడతాయి. రికార్డ్ చేసేది లెన్స్ ద్వారా కాబట్టి లెన్స్ కి అడ్డంగా ఏమీ ఉండకుండానే ఫిక్స్ చేస్తారు. దీని ఆధారంగా సీక్రెట్ కెమెరాలను మీరు చెక్ చేయవచ్చు.
లైట్స్ ఆఫ్ చేసే వెతకండి
లైట్లను ఆఫ్ చేయండి, అప్పుడు మీరు ఫోన్ ఫ్లాష్ లైట్ వెయ్యండి. ఒకవేళ కనుక ఎక్కడైనా చిన్న లైట్ వెలిగినా లేదంటే వాటి మీద వెల్తురు పడి మెరిసినా మీరు గుర్తించొచ్చు.
పెయింటింగ్స్
మీరు హోటల్ లో స్టే చేసినప్పుడు ఎక్కడైనా అద్దం లేదంటే పెయింటింగ్స్ వంటివి ఉంటే వాటిని తీసి చూడండి. వాటికి ఫిక్స్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఈ వస్తువులను కూడా చూడండి
వాల్ హ్యాంగర్స్, స్మోక్ అలారం, లాంప్లలో కూడా పెట్టొచ్చు. కాబట్టి వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి.
స్మార్ట్ ఫోన్ యాప్స్
కొన్ని యాప్స్ ద్వారా హిడెన్ కెమెరాలు, స్పై కెమెరాలు వంటివి కనిపెట్టొచ్చు. ఒకవేళ మీకు కెమెరా ఉందని సందేహం కలిగినట్లయితే ఇలా మీరు యాప్స్ ద్వారా కూడా వెతకొచ్చు.
ఇక్కడ కూడా చెక్ చేయాలి
డోర్ లాక్స్, హ్యాంగర్లు, బెడ్ ల్యాంప్స్, ఫైర్ అలారం, స్పీకర్ల మెష్, బొమ్మలు, గోడల సందుల్లో పెట్టే అవకాశం ఉంటుంది. బాత్రూం లో, షెల్ఫ్స్ లో కూడా పెట్టొచ్చు.