తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. దేశం కోసం రాజీవ్ గాంధీ కుటుంబం త్యాగాలు చేసిందని మంత్రి కోమటి రెడ్డి పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించడంతో ఆయన మన కళ్ల ముందే ఉన్నట్టు కనిపిస్తోందన్నారు. రాజీవ్ గాంధీ 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించారని పేర్కొన్నారు.
గ్రామాలకు డైరెక్ట్ గా ఫండ్స్ పంపించారు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ విగ్రహ రూప కర్త రమణారెడ్డి కి అందరూ అభినందనలు తెలిపారు. అద్భతమైన విగ్రహాన్ని తయారు చేశావని పలువురు మంత్రులు కొనియాడారు. ప్రాణాలను సైతం లెక్కచేయని వారసత్వ కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం అని కొనియాడారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల గుండెల్లో రాజీవ్ గాంధీ చిరస్థాయిగా ఉంటారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.