మోతీలాల్ నెహ్రు కోట్ల సంపదను జాతికి అంకితం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

-

మోతీలాల్ నెహ్రు కోట్ల సంపదను జాతికి అంకితం చేశారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సచివాలయంలో  రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు.  ఇది రాజకీయ వేదిక కాదు.. త్యాగం అంటే రాబోయే తరాలకు, చిల్లర మల్లరగా మాట్లాడే వారికి గుర్తు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పది సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైలులో ఉన్నారు. భారతదేశానికి మొదటి ప్రధాని అయ్యారంటే.. దేశానికి చేసిన త్యాగం వల్లనే అన్నారు.

దేశం మతకలహాలతో అట్టుడుకుతున్న సమయంలో భారత ప్రధానిగా నెహ్రుగా ఉన్నప్పుడు  563 సంస్థానాలను, రాజ్యాలను భారతదేశంలో విలీనం చేశారు. నెహ్రు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను హోంశాఖ మంత్రిగా పని చేశారు. నెహ్రు దేశానికి గొప్ప ఆలోచన, విద్య విధానం అందించారు. ఆదివాసులు, దళితులు, మైనార్టీలు ఇందిరమ్మ ఫొటోను పెట్టుకొని పూజిస్తున్నారని గుర్తు చేసుకుంటున్నారు. బ్యాంకులను జాతీయికరణ చేసింది ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. రాజభరణాలను రద్దు చేసింది ఇందిరాగాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news