చాలామందికి ఆల్కహాల్ బాగా అలవాటు. రోజు ఆల్కహాల్ ని తీసుకుంటూ ఉంటారు. ఆల్కహాల్ ని తాగినప్పుడు బానే ఉంటుంది కానీ తర్వాత హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. హ్యాంగ్ ఓవర్ తో మీరు కూడా బాధపడుతున్నారా అయితే ఇలా చేయాల్సిందే. ఈ చిట్కాలు ని ట్రై చేస్తే హ్యాంగోవర్ సమస్య నుండి ఈజీగా బయటపడొచ్చు ఆల్కహాల్ ఎక్కువ తీసుకునేటప్పుడు హ్యాంగ్ ఓవర్ కచ్చితంగా ఉంటుంది.
దాంతో తలనొప్పి వికారం వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. హ్యాంగ్ ఓవర్ ని తగ్గించుకోవాలంటే ఇలా చేయండి. అరటిపండును తీసుకుంటే తగ్గుతుంది బాడీ ఎలక్ట్రోలైట్స్ ని ఆల్కహాల్ తీసుకోవడం వలన కోల్పోతుంది అయితే మీరు కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ని అరటి పండ్లతో పొందొచ్చు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా మళ్ళీ మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఆల్కహాల్ వల్ల రక్తంలో కోల్పోయిన షుగర్ లెవెల్స్ కార్బోహైడ్రేట్స్ ద్వారా తిరిగి పొందొచ్చు.
ఆల్కహాల్ తాగడం వలన బాడీ త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది అందుకని నీళ్లు ఎక్కువ తాగితే డిహైడ్రేషన్ సమస్య ఉండదు. బాగా ఉప్పు వేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా హ్యాంగ్ ఓవర్ నుండి బయటపడొచ్చు. సాల్ట్ వాటర్ ని కూడా మీరు కావాలనుకుంటే తాగొచ్చు హ్యాంగ్ ఓవర్ నుండి కాఫీ టీలు కూడా బయట పడేస్తాయి. అలానే కోడిగుడ్లని తీసుకుంటే కూడా ఈ బాధ నుండి బయటపడవచ్చు ఇలా హ్యాంగ్ ఓవర్ తో బాధపడే వాళ్ళు వీటిని తీసుకుని వెంటనే హ్యాంగోవర్ నుండి బయటపడండి.