వావ్ అమేజింగ్: పృధ్వి షా డబుల్ సెంచరీ … ఇంగ్లీష్ బౌలర్లను రప్పాడించాడు !

-

ఇండియా క్రికెటర్ పృథ్వి షా చిన్న వయసులోనే క్రికెట్ లో అద్భుతాలు సృష్టించిన సృష్టించాడు. ఆ తర్వాత ఇండియా టీం లోకి త్వరగానే వచ్చిన నిలకడ లేమితో ఇబ్బందులు పడుతూ ఇప్పుడు ఇంగ్లీష్ కౌంటీ జట్లలో ఆడి ఫామ్ ను దొరకబుచ్చుకుని మళ్ళీ జాతీయ జట్టులో చోటును దక్కించుకోవాలని ఆరాటపడుతున్నాడు. కాగా ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్ డే టోర్నమెంట్ లో నార్తంప్టన్ షైర్ మరియు సోమర్సెట్ తో తలపడింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్ షైర్ తరపున ఆడుతున్న పృథ్వి షా ఓపెనర్ గా బరిలోకి దిగి పరుగుల మెయిలు రాయిని అందుకున్నాడు. సోమర్సెట్ బౌలర్లను ఉతికి ఆరేశాడు అని చెప్పాలి, ప్రస్తుతం బ్యాటింగ్ ను కొనసాగుతున్న పృథ్వి షా 141 బంతుల్లో 222 పరుగులు చేశాడు. ఇందులో మొత్తం 26 ఫోర్లు మరియు 9 సిక్సులు ఉన్నాయి.

ఇదే విధంగా తన ఫామ్ ను కొనసాగిస్తే ఇండియా జట్టులోకి మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇండియన్ పవర్ ఏమిటో ఇంగ్లీష్ బౌలర్లకు రుచి చూపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news