స్ఫూర్తి: భర్త చనిపోయాడు.. కూతురు చదువుకోసం ఆమె ఆఖరికి ఇలా..? ఈ గృహిణి స్టోరీ చూస్తే మెచ్చుకుంటారు..!

-

జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోదు. అప్పుడప్పుడు జీవితంలో కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. పెళ్ళై భర్తతో ఆమె అప్పటి దాకా సంతోషంగా ఆమె ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక రోజు భర్త రోహిత్ కి రోడ్ యాక్సిడెంట్ అయింది. 33 ఫ్రాక్చర్లు ఎడమ కాలికి అవడంతో సర్జరీ చేశారు. నెమ్మదిగా సర్జరీ తర్వాత రికవరీ అయ్యారు. కానీ అనుకోకుండా అతను ఒక రోజు చనిపోయారు.

అప్పటి నుండి ఈమె జీవితం లో కష్టాలు మొదలు అయ్యాయి. నిజంగా ఈమె ఎన్నో బాధలు పడ్డారు. పెళ్లికి ముందు దీప్తి మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజినీర్ క్వాలిఫై అయ్యారు. అయినప్పటికీ ఆమె గృహిణిగానే ఉండిపోయారు. తన భర్త మరణంతో ఆమె పని చేయాలని అనుకున్నారు. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నారు. అంతే కానీ భర్త లేరని కృంగిపోలేదు. అక్కడే జీవితం అయ్యిపోయింది అని ఆమె ఆగిపోలేదు. తన కూతుర్ని చదివించడం కోసం కుటుంబాన్ని నడిపించడం కోసం ఆమె దోస పాయింట్ ని పెట్టారు.

ఈ వ్యాపారం మొదలు పెట్టడం కోసం పదివేల రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మంచి నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆమె అనుకున్నారు. ఫిబ్రవరి 14న యషిక దోస పాయింట్ అనే ఒక దోస పాయింట్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఉదయం 11 నుంచి రాత్రి 9 వరకు సోమవారం నుండి శనివారం వరకు ఈ దోస పాయింట్ ఓపెన్ చేసి ఉంటుంది. ఆదివారం మాత్రం సెలవు ఇచ్చేవారు.

ఈమె తన దోస సెంటర్ లో మసాలా దోస, చాక్లెట్ దోస వంటివి తయారు చేసే వారు అలానే ఇడ్లీ, ఉతప్పం, వడ వంటివి కూడా ఇక్కడ దొరికేవి. ప్రస్తుతం ఈమె రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నారు. నెలకి ఇంచుమించు 35 వేల రూపాయలను ఈమె సంపాదిస్తున్నారని చెప్పారు. పైగా ఈమె ఉద్యోగమంటే పెద్దది చిన్నది ఏమీ ఉండదు అని.. ఈ పని చేయడం చాలా తృప్తిగా ఉందని ఆమె చెప్పారు. ఇలా ఈమె కృంగిపోకుండా దోస పాయింట్ ద్వారా చక్కటి లాభాలను పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version