ఆఫీస్ లోనే పెళ్లి చేసేసుకున్న ఐఏఎస్, ఐపిఎస్…!

-

ఇంట్లో పెళ్లి జరుగుతుంది అంటే ఆ ఇంట్లో వారం రోజుల ముందు నుంచే ఇల్లంతా సందడిగా తిరుగుతూ, ఒకరోజు సంగీత్, ఒకరోజు మెహెంది, ఒకరోజు బ్యాచిలర్స్ పార్టీ ఇలా చేయడం ఈ మధ్య అందరం చూస్తూనే ఉన్నాం. ఇక అసలు ఘట్టం మొదలయ్యే రోజూ అంతే పెళ్లి జరిగే రోజు చుట్టాలు, స్నేహితులు, ఇలా అందరిని పిలిచి భోజనాలు పెట్టీ అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదాలు తీసుకుని వేడుకగా చేస్తారు.

ఎందుకంటే పెళ్ళి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే అందరూ ఈ జ్ఞాపకం జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఎవరి స్తోమతకు తగ్గట్టు వారు చేసుకుంటారు. అయితే క్షణం తీరిక లేకుండా పోతున్న ఈ రోజుల్లో, ఉరుకుల పరుగుల జీవితంలో టైంకి ఇచ్చే విలువ జీవితంలో మరి వేటికి ఇవ్వట్లేదు. ఇక పెళ్లికి అన్ని రోజులు కేటాయించడానికి టైమ్ లేదనుకున్నారు ఈ యువ జంట, అనుకున్నదే తడవుగా వారు ఉద్యోగం చేసే ఆఫీస్ లోనే ఉంగరాలు మార్చుకుని పెళ్లి తంతు ముగించేసారు.

అంత తీరిక లేని ఉద్యోగాల అని సందేహం రాకమానదు. అవును అలాంటి ఉద్యోగాలే వారివి ఒకరు ఐ ఎ ఎస్ కాగా ఒకరు ఐ పీ ఎస్. వివరాల్లోకి వెళ్తే పంజాబ్ కు చెందిన తుషార్ సింగ్లా ఐఏఎస్ కు ఎంపికయ్యాడు. ప్రస్తుతం ఉలుబేరియాలో ఎస్‌డిఓగా పనిచేస్తున్నాడు.ఇక వధువు నవజోత్ సిమి బీహార్ కేడర్ ఐపిఎస్ అధికారి. నవజోత్ సిమి తుషార్ సింగ్లా కొన్ని రోజుల క్రితం నుంచి ప్రేమించుకుంటున్నారు. 2021లో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల వల్ల తుషార్ సింగ్లా బిజీగా ఉండడం వల్ల చాలా సార్లు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా ఏవో కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

దీంతో ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు. పాట్నాలో నవజోత్ సిమి వాలెంటైన్స్ డే రోజున కోల్ కతాలోని తుషార్ ఆఫీస్ కు వెళ్లారు. కుటుంబ సభ్యులు కూడా అక్కడకు వచ్చారు. వధూ వరులు ఇద్దరు పెళ్లి బట్టలు ధరించి కుటుంబ సభ్యులు, ఆఫీస్ సిబ్బంది సమక్షంలో అక్కడ రిజిస్ట్రార్ ను పిలిచి సంతకాలు చేసి పెళ్లి తంతు పూర్తి చేశారు. ఆ కార్యక్రమం ముగిశాక ఆఫీస్ బయట ఫోటోలకు పోజులిచ్చారు. ఇద్దరు తమ తమ ఉద్యోగ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉండటం వల్ల ఈ రకంగా పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని మీడియాకి తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version