ఆ తెగలో…పిల్లలు పుట్టాకే పెళ్లి.. వందల ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితి..!

-

పెళ్లి కాకుండా తల్లి అవ్వడాన్ని పెద్ద నేరంగా మన దగ్గర భావిస్తారు. పొరపాటున ఈ విషయం బయటకు తెలిసిందో… ఇక ఆ అమ్మాయి బతకు బందర్ బీచే. పరువు తీస్తారు. గొడవలు, పంచాయితీలు.. అమ్మో చాలా ఉంటాయి. కానీ ఓ తెగలో మాత్రం దీన్నే ఆచారంగా చేసుకుని పాటిస్తున్నారు. ఏంటి అర్థం కాలేదా.. అక్కడ ముందు తల్లైతేనే.. పెళ్లి ముచ్చట తీస్తారు. సహజీవనం చేసి.. ఇష్టమైన వ్యక్తితో పిల్లలను కని.. ఆర్థికంగా స్థిరపడ్డాకే పెళ్లి జోలికి వెళ్తారు. ఈ మధ్యలో తేడాలోస్తే.. విడిపోతారు. అక్కడ అదంతా పిచ్చ కామన్ అట. ఇదంతా వింటుంటే.. ఇవి మన దగ్గర కాదులే.. విదేశాల్లోనే అనుకుంటారేమో.. మన దేశంలోనే ఉందా వింత ఆచారం..
రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ‘గరాసియా తెగ’ విస్తరించి ఉంది. అయితే వీళ్ల సంప్రదాయం ప్రకారం.. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవడానికి నిర్ణీత వ్యవధుల్లో రెండు రోజుల పాటు ఓ జాతర జరుగుతుంటుంది. ఇందులో భాగంగా తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని.. పెళ్లితో సంబంధం లేకుండా అతడితో సహజీవనం స్టాట్ చేస్తారు.. ఈ క్రమంలో అబ్బాయి కుటుంబ సభ్యులు కొంత సొమ్మును అమ్మాయి కుటుంబానికి ఇస్తారు.. అంటే.. ఇది ఒక రకంగా ఎదురుకట్నం/కన్యాశుల్కం లాంటిదే.. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో ఈ జంట వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న సమయంలోనూ పెళ్లి ఖర్చులన్నీ వరుడి కుటుంబ సభ్యులే భరిస్తారట. భలే ఉంది కదా.. పైగా వరుడి ఇంట్లోనే పెళ్లి వేడుకలన్నీ ఘనంగా నిర్వహించే ఆచారం ఇక్కడ దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది.
ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి ఏళ్ల పాటు సహజీవనం చేసే ఆచారం ఈ తెగలో ఉంది. ఈ క్రమంలో పిల్లల్ని కనొచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి అంటే.. వ్యవసాయం, కూలీ పనులు చేయడం ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తులుగా ఉంటాయి. ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా ఏర్పడ్డాకే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకోవచ్చట. ఈ పద్ధతిని ‘దాపా’ అంటారు.
సహజీవనంలో ఉన్న భాగస్వామి తమను వేధించినా, ఇకపై అతడితో కొనసాగలేమని నిర్ణయించుకున్నా.. ఈ బంధం నుంచి ఈజీగా బయటికి వచ్చేయొచ్చు. మొత్తానికి పెళ్లి విషయంలో ఇక్కడి స్త్రీలపై లేనిపోని ఆంక్షలు విధించకుండా.. పూర్తి స్వేచ్ఛ కల్పిస్తూ, వారి నిర్ణయాలను గౌరవిస్తున్నారన్న విషయం అయితే అర్థమవుతుంది.
ఇది వినడానికి వింతగా అనిపించచ్చు.. కానీ ఈ ఆచారాలే కాలక్రమేణా వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు.. వంటివెన్నో తగ్గించాయని అక్కడి వారు చెబుతున్నారు. కానీ ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే.. అలా ఎంత మందితో సహజీవనం చేయొచ్చు.. ఇష్టం లేకపోతే సహజీవనం చేసే వ్యక్తి నుంచి బయటపడొచ్చు అంటున్నారు.. కానీ మళ్లీ ఆమె పరిస్థితి ఏంటి..? వేరొకరితో ఉండొచ్చా..ఇలాంటి అనుమానాలు చాలా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news