వాట్సాప్‌లో ఆహ్వానం…! లైవ్‌లో పెళ్లి…!

-

ఈ టెక్నాలజీ అభివృద్ధి కావడం కాదు కానీ పెళ్లిళ్లు కూడా ఆన్లైన్ లోనే అయిపోతున్నాయి. పూర్వం పద్ధతులు అన్ని మరచిపోయి ఈ కొత్త పద్ధతినే అంత అనుసరిస్తున్నారు. పెళ్ళికి బంధుమిత్రులు వచ్చి ఆశీర్వదించడం వంటివి రోజు రోజుకి దూరం అయిపోతున్నాయి. కట్ చేస్తే వాట్సాప్‌లో ఆహ్వానం…! లైవ్‌లో పెళ్లి ఇలానే ఉంది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు పెళ్లిళ్లు మొత్తం ఆన్‌లైన్‌ వేదికగా జరుగుతున్నాయి. టెక్నాలజీ తో వివిధ కొత్త పద్ధతులని తీసుకు వస్తున్నారు. మొన్నటికి మొన్న ఏకంగా ఇంటికే పెళ్లి భోజనాలు పంపించిన వార్త కూడా వైరల్ అయ్యింది.

పెళ్లి అనే సరికి వాట్సాప్‌లో ఆహ్వానం పంపడం చూస్తున్నాం. పైగా ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వధూవరుల ఫొటోలు, కల్యాణ వేదిక, సమయం వివరాలతో సరి కొత్తగా రూపొందిస్తున్నారు. ఇలా చేయడం సులువు కూడా. అలానే బంధువులు, స్నేహితులకు గూగుల్ మ్యాప్ లొకేషన్ ని పెళ్లి కార్డుల మీద ముద్రించడం కూడా ట్రెండ్ అయిపోయింది. ఇది కాస్తో కూస్తో నయమే.

మరోవైపు ముఖ్యమైన బంధువులు, స్నేహితులలో పెళ్లి అంటూ వాట్సాప్‌ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా వారు నిశ్చితార్థం మొదలు పెళ్లి వరకు ఎప్పటికి అప్పుడు అప్డేట్స్ ని ఇస్తున్నారు. ఇది కూడా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది. పెళ్లి కుమార్తె మండపానికి రావడంతో మొదలు, మాంగల్యధారణ, బంధుమిత్రుల ఆశీర్వచనాలు, విందు భోజనాల వరకు యూట్యూబ్, ఫేస్‌బుక్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు చేసేస్తున్నారు. దీనితో లైవ్ లోనే పెళ్ళిళ్ళని చూసేసి ఇంట్లో ఉండే ఆశీర్వదిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news