రైల్వేస్ లో గుట్కా మరకలను క్లీన్ చేయటానికి రైల్వేకు 120 కోట్ల ఖర్చు..ఈ ఐడియాతో ఇక చెక్..!

-

ఓ పక్క ప్రధాని మోది స్వచ్చ్ భారత్..క్లీన్ ఇండియా అంటూ శుభ్రత గురించి చెప్తున్నారు. పల్లెల నుంటి పట్నాల వరకూ అంతా క్లీన్ గా ఉండాలనే ఎంతో ఖర్చుపెట్టి చేయిస్తున్నారు. అయినా కొందరిలో ఎలాంటి మార్పు ఉండదు..అందులో ఒకటి ఈ రైల్ లో గుట్కా తిని ఉమ్మేయటం. రైళ్లలో ప్రయాణం అంటే మనలో చాలా మందికి ఇష్టముండే ఉంటుంది. కానీ రైళ్లలో ఎక్కువ గుట్కాలు తిని అక్కడే ఊసేస్తుంటారు. అది తోటి ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీటిని క్లీన్ చేయటానికి భారతీయ రైల్వేస్ కి కూడా పెద్దే సమస్యే..కేవలం రైల్వేస్ లో గుట్కా మరకల్ని శుభ్రం చేయటానికి ప్రతిసంవత్సరం 1200కోట్లు ఖర్చుఅవుతున్నాయట. అందుకే దీనికి ఒక పరిష్కారం ఆలోచించారు..అదేంటంటే..

బహిరంగంగా ఉమ్మివేతలను నివారించే ప్రయత్నంలో రైల్వే శాఖ స్పిట్టర్ కియోస్క్‌ లను రైల్వే స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రైల్వే శాఖ దేశవ్యాప్తంగా 42 స్టేషన్లలో కియోస్క్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. చిన్న బడ్డీ కొట్టు/ వెండింగ్ మిషన్ లా కనిపించే ఈ కియోస్క్‌ల్లో స్పిట్టూన్ పౌచ్‌లు ఉంటాయి.

ఒక్కో పౌచ్‌ ధర రూ. 5 నుంచి 10 వరకు ఉంటుంది. పాన్, గుట్కా అలవాటున్నవారు ఈ కియోస్క్‌ల నుంచి పౌచ్ కొనుక్కొని అందులో ఉమ్మివేయొచ్చు. బహిరంగ ప్రదేశాలను అపరిశుభ్రం చేయకుండా ప్రజలు ఈ పౌచ్ లను వినియోగిస్తారని రైల్వేశాఖ ఆశిస్తోంది. తద్వారా మరకలను క్లీన్ చేసే ఖర్చులు తగ్గుతాయని భావిస్తోంది.

వీటి మరకలను తొలగించేందుకు ప్రభుత్వం వేల లీటర్ల నీటితో పాటు డబ్బులను ఖర్చుపెడుతుంది. అయినప్పటికీ ఈ సమస్య మాత్రం తగ్గటంలేదు. రైల్వే శాఖ బయోడిగ్రేడబుల్ ఉమ్మివేతల సంచులను ప్రజలకు అత్యంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ స్పిట్టూన్ పౌచ్‌లను గుట్కా తినేవారు వారి జేబులో ఉంచుకోవచ్చు. ఉమ్మి వేసే సమయంలో వీటిని సులభంగా వాడుకోవచ్చు. ఈ పౌచ్‌ల్లోని ఉమ్మి నుంచి బ్యాక్టీరియా వెలుపలికి రాకుండా మ్యాక్రోమాలిక్యులర్‌ పల్ప్‌ టెక్నాలజీ ఉపయోగించారు.

ఈ పౌచులు ఉమ్మి పీల్చుకొని ఘన పదార్థంగా మారుస్తాయి. వీటిని బయట పడేసినప్పుడు అవి మొక్కలుగా మారుతాయి. అందువల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదు. ఈ చిన్నపాటి సంచులను దాదాపు 20 సార్లు ఉపయోగించేలా రూపొందిస్తున్నారు. బానేఉంది కానీ..ఇలా రైల్లలో ఉమ్మేవారు బాధ్యతారాహిత్యపరులే అయి ఉంటారు. అలాంటి వారు బాధ్యతగా వెళ్లి డబ్బులు పెట్టి ఆ సంచులు కొంటారా అనేది ప్రశ్న.

Read more RELATED
Recommended to you

Latest news