రాష్ట్రపతిని కలిసిన కాంగ్రెస్ నేతలు… లఖీంపూర్ ఘటనపై ఫిర్యాదు

యూపీ లఖీంపూర్ లో జరిగిన ఘటన ఇంకా చల్లారడం లేదు. రైతులు మరణించడంతో ఘటన రాజకీయ రంగు పులుముకుంది. కాంగ్రెస్ పార్టీ లఖీంపూర్ ఘటనపై నిరసన వ్యక్తం చేస్తోంది. ఇటీవల కిసాన్ న్యాయ్ ర్యాలీ పేరుతో ప్రధాని మోదీ నియోజకవర్గం వారణాసిలో నిరసన వ్యక్తం చేసింది. ఘటనపై పొలిటికల్ ప్రెజర్ పెరగడంతో కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రాను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.

 తాజాగా లఖీంపూర్ ఘటనపై కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్ రాష్ట్రపతిని కలిసిన వారిలో ఉన్నారు. ఘటనపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని, కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను రాజీనామా చేయించాలని రాష్ట్రపతిని కోరారు. ఘటనపై తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్రపతి కాంగె్రస్ నేతలకు హామీ ఇచ్చారు.