గతజన్మ నిజంగా ఉంటుందా..? ఇలాంటి సంకేతాలు వాటికి గుర్తులే..!

-

చాలాసార్లు మనం పోయిన జన్మలో మనం ఇలా పుట్టి ఉంటాం అందుకే ఇప్పుడు మనిషిలా పుట్టాం, పోయినజన్మలో నువ్వు నేను అక్కతమ్ముళ్లమేమో.. అందుకే ఇప్పుడ మన బంధం అలానే ఉంది అంటూ ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుకుంటాం. ఈ జన్మలో పాపాలు చేస్తే వచ్చే జన్మలో ఘోరంగా పుడతావురా అంటారు. ఏ కుక్కలానో, ముళ్లపందిలానో ఇంకా ఇలా.. అసలు ఈ జన్మలు నిజంగా ఉంటాయి.. ఒక్కోసారి మీకు జరిగేది అదే మొదటిసారి అయినా ఇలా ఇంతకుముందే జరిగింది అనిపిస్తుందా..? అవి గతజన్మల గుర్తులంటారా.?

పునర్జన్మ ఉందా లేదా అనే దాని పై చాలా పరిశోధనలు జరిగాయి. జరుగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. కొందరు ఇది అపోహ అని కొట్టి పారేస్తే, మరి కొందరు ఇది నిజమే అని నమ్ముతున్నారు. మనిషి చనిపోయిన తరువాత ఆ ఆత్మ మరొక శరీరముతో మళ్ళీ జన్మిస్తుందని హిందువులు విశ్వాసం. అయితే పునర్జన్మ ఉంటుంది అని సైన్స్ చెప్తోంది. దీనిపై కొందరు శాస్త్రవేత్తల పరిశోధనలు జరిపారు.

డెజావు

ఏదైనా ఒక సంఘటన జరిగినపుడు మీరు కొత్తగా ఫిల్ అవడమో, లేదా ఏదైనా వాయిస్ విన్నప్పుడు లేదా మ్యూజిక్ విన్నప్పుడు లేదా కొత్త ప్రదేశాన్ని కానీ, కొత్త మనిషిని కానీ కలిసినపుడు మీ మనసులో ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ మొదలవుతుంది. ఈ ఫీలింగ్‌నే మన భాషలో లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అంటారు. కానీ దాన్ని డెజావు అంటారు. ఆ భావన కలిగితే మీకు గత జన్మ ఉందని అర్ధం.

విచిత్ర జ్ఞాపకాలు:

కొంతమంది పిల్లలకి కొన్ని విచిత్రమైన జ్ఞాపకాలు ఉంటాయి. కానీ వాళ్ళు వాటిని రాత్రిపూట వచ్చిన కలలుగా అనుకుంటారు. కానీ అవి వాళ్ళ గత జన్మకి సంబంధించిన గుర్తులు.

కలలు:

మీకు వచ్చే కలలలో అన్ని ఫాంటసీ కాదు. కొన్ని మీ గత జన్మకు సంబంధించిన క్లూస్ కూడా అయి ఉండొచ్చు.

ఫియర్స్, ఫోబియా:

అందరికి ఉండే సహజమైన భయాలు కాకుండా, కొందరు నీళ్లను, పక్షులను, నంబర్లను, మిర్రర్స్, మొక్కలను, కొన్ని రంగులను చూసి భయపడుతుంటారు. గత జన్మలో వాటివల్ల మరణం కలిగిందేమో అని అంటున్నారు నిపుణులు.

విదేశీ కల్చర్ అంటే ఆకర్షణ:

కొంతమంది విదేశీ కల్చర్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంటారు. వారి దగ్గర డబ్బులు లేకపోయినా బ్రాండ్ వస్తువులు వాడుతూ, లగ్జరీ లైఫ్‌ను ఎంజాయ్ చేయాలనుకుంటారు. అంటే వీరు గత జన్మలో ఫారెన్‌లో పుట్టి పెరిగి ఉండవచ్చు.

కోరికలు:

కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి. బుక్స్ చదవడం, కథలు రాయడం, సంగీతం అంటే ఇష్టపడుతారు. వాటిలో కొన్ని గత జన్మకు సంబంధించినవి కావచ్చు.

అన్ కంట్రోలబుల్ హాబిట్స్:

కొన్ని అలవాట్లను మనం ఎంత కంట్రోల్‌ చేయాలనుకున్నా అవి అస్సలు మానలేం. అది గోర్లు కొరకడం, కబుర్లు చెప్పడం, టీవి, ఫేస్ బుక్, డ్రగ్స్ వంటి వాటికి అలవాటు పడడం. పునర్జన్మను నమ్మే వారు వీటిని గతజన్మకు సంబంధించినవిగా చెప్తారు.

బర్త్ మార్క్స్:

శరీరం మీద ఉండే కొన్ని మచ్చలు మనకు పునర్జన్మ ఉందని చెబుతాయని ఒక సంఘటన నిర్దారించింది. మహా రామ్ అనే అబ్బాయి తనను గత జన్మలో ఎవరో ఒక వ్యక్తి గన్ తో కాల్చడని చెప్పాడు. దానికి గుర్తుగా ఆ అబ్బాయి చెస్ట్ పై ఒక మచ్చ ఉంది. ఆ స్టోరీ చెక్ చేసినపుడు మహా రామ్ అనే వ్యక్తి బుల్లెట్ తగిలి చనిపోయినట్టు ప్రూవ్ అయ్యింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version