సాధారణంగా భూమి 23.4 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది కనుక భూమిపై ఉత్తరార్థ గోళంలో ఉన్న ప్రదేశంలో ఎక్కువ సూర్యకాంతి పడుతుంది. అందుకని ఈ ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో పగలు ఎక్కువగా ఉంటుంది.
జూన్ 21.. ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకునే రోజు.. అందులో భాగంగానే ఇవాళ కూడా యోగా డేను అందరూ జరుపుకుంటున్నారు. అయితే ఈ రోజుకు మరో ప్రత్యేకత కూడా ఉంది. అది కూడా భౌగోళిక పరంగా.. అవును.. నిజమే.. అదేమిటంటే.. సంవత్సరంలో ఎండాకాలంలో పగలు ఎక్కువగా రాత్రి తక్కువగా, చలికాలంలో రాత్రి ఎక్కువగా, పగలు తక్కువగా ఉంటుందని తెలుసు కదా. అయితే సంవత్సరం మొత్తం మీద కేవలం ఈ రోజు మాత్రమే అన్ని రోజుల కన్నా పగలు ఎక్కువగా ఉంటుంది.
సాధారణంగా భూమి 23.4 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది కనుక భూమిపై ఉత్తరార్థ గోళంలో ఉన్న ప్రదేశంలో ఎక్కువ సూర్యకాంతి పడుతుంది. అందుకని ఈ ప్రాంతంలో ఉన్న ప్రదేశాల్లో పగలు ఎక్కువగా ఉంటుంది. ఇక చాలా దేశాల్లో జూన్ 21న పగలు ఎక్కువగా ఉంటే.. కొన్ని దేశాల్లో మాత్రం ఇలా జూన్ 20 లేదా 22వ తేదీల్లో జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలో అలస్కాలో గరిష్టంగా 24 గంటల పాటు సూర్యకాంతి ఉంటుంది.
ఇక ఈ రోజున ఉత్తర దిశగా ఎంత దూరం వెళ్లే కొద్దీ.. అంత దూరం పగలు ఎక్కువగా ఉంటుంది. అయితే జూన్ 21న పగలు ఎక్కువగా ఉన్నట్లే డిసెంబర్ 22న రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో దక్షిణార్థ గోళంలో సూర్యకాంతి ఎక్కువగా ఉంటుంది. కనుక ఇవతలి వైపు ఉన్న ప్రదేశాల్లో ఆ రోజున రాత్రి ఎక్కువగా ఉంటుంది.