రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్‌న్యూస్‌.. వ‌డ్డీ లేకుండా రూ.1ల‌క్ష వ‌ర‌కు రుణం..!

-

ప్ర‌ధాని మోదీ త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా రైతుల‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను అందిస్తామ‌ని గ‌తంలో చెప్పారు. కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కం కింద రైతుల‌కు రూ. 1ల‌క్ష వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

ప్ర‌ధాని మోదీ గ‌తంలో రైతుల‌కు కిసాన్ స‌మ్మాన్ నిధి ప‌థ‌కం కింద ఏడాదికి రూ.6వేల ఆర్థిక స‌హాయం అందిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కం ఇప్ప‌టికే అమ‌లులో ఉండ‌గా.. దీని కింద 5 ఎక‌రాల లోపు స్థ‌లం ఉన్న రైతుల‌కు రెండు విడత‌లుగా.. త‌డ‌వ‌కు రూ.3వేల చొప్పున మొత్తం రూ.6వేల ఆర్థిక స‌హాయం అందిస్తున్నారు. అయితే ఇక‌పై రైతుల‌కు రూ. 1ల‌క్ష వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాన్ని అందించేందుకు మోదీ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. త్వ‌ర‌లో రానున్న పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఇందుకు గాను ప్ర‌త్యేక బ‌డ్జెట్‌ను ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం సిద్ధం చేసింద‌ని తెలిసింది.

ప్ర‌ధాని మోదీ త‌మ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో భాగంగా రైతుల‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను అందిస్తామ‌ని గ‌తంలో చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కం కింద రైతుల‌కు రూ. 1ల‌క్ష వ‌ర‌కు వ‌డ్డీ లేని రుణాల‌ను అందించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే జూలై 5వ తేదీన జ‌ర‌గ‌నున్న బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ ప‌థ‌కం కోసం కొంత బడ్జెట్‌ను కేటాయించ‌నున్నార‌ని తెలిసింది. ఇప్ప‌టికే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామన్ 2019-20 బ‌డ్జెట్‌ను సిద్ధం చేస్తున్నందున అందులో ఈ ప‌థ‌కానికి కూడా నిధులు కేటాయించార‌ని తెలిసింది.

అయితే కిసాన్ స‌మ్మాన్ యోజ‌న ప‌థ‌కంలో రూ.1 ల‌క్ష వ‌ర‌కు రుణం తీసుకుంటే దానికి వ‌డ్డీ చెల్లించాల్సిన ప‌నిలేదు. ఇక రుణాన్ని కూడా 1 నుంచి 5 ఏళ్ల లోపు తీర్చేయ‌వ‌చ్చు. ఈ క్ర‌మంలో దేశంలో ఉన్న చిన్న‌, స‌న్న‌కారు రైతులంద‌రికీ ఈ ప‌థ‌కం ఎంతో ల‌బ్ది చేకూరుస్తుంద‌ని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు రైతుల‌కు నెల‌కు క‌నీస పెన్ష‌న్ రూ.3వేలు ఇచ్చే ప‌థ‌కాన్ని కూడా ఇదే బ‌డ్జెట్ స‌మావేశాల్లో ప్ర‌వేశ‌పెట్టాల‌ని మోదీ భావిస్తున్నార‌ట‌. మ‌రి ఈ సారి నిజంగానే మోదీ ఈ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తారా, లేదా చూడాలి. ఒక వేళ అదే జ‌రిగితే ఎంతో మంది రైతుల‌కు మేలు జ‌ర‌గ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news