మనం ఇతరులతో ఏమైనా విషయాలు చెప్తే మనకి కాస్త భారం తగ్గుతుంది. ప్రశాంతంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. మన బాధలన్నీ తొలగిపోయి ఫ్రీగా ఆనందంగా ఉంటాము. అయితే ఆచార చాణక్య మాత్రం చాణిక్య నీతి ద్వారా ఈ విషయాలని అస్సలు చెప్పకూడదని అంటున్నారు. మరి ఎటువంటి విషయాలని మనం ఇతరులతో చెప్పకూడదు రహస్యంగా ఉంచాలి అనే విషయాలని ఇప్పుడు చూద్దాం.
డబ్బుల గురించి చెప్పద్దు:
ఎప్పుడూ కూడా ఇతరులతో డబ్బులకి సంబంధించిన విషయాలను చెప్పకూడదని నీతి శాస్త్రం ద్వారా ఆచార్య చాణక్య చెప్పారు. డబ్బు లేదు అంటే ఆ వ్యక్తిని గౌరవించడం మానేస్తారు. పైగా ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేయరు సరి కదా ఎగతాళి చేస్తారు.
గౌరవం గురించి:
గౌరవం ఇస్తే గర్వపడకూడదు అని ఆచార్య చాణక్య చెప్పారు ఒకవేళ కనుక అవమానం జరిగినా అది ఇతరులతో చెప్పకూడదు. ఒకవేళ కనుక ఎవరికైనా గౌరవం దక్కలేదని చెబితే ఆత్మగౌరవం తగ్గించుకున్నట్టు అవుతుంది పైగా ఆ వ్యక్తి ఎవరితో చెప్పారో వాళ్లు గౌరవం ఇవ్వడం మానేస్తారు.
వ్యక్తిగత రహస్యాలు:
ఎప్పుడు కూడా వ్యక్తిగత రహస్యాలని ఇతరులతో చెప్పకూడదు ఏదైనా బాధ వస్తే హృదయంలో ఉంచుకోవాలే తప్ప ఇతరులతో చెప్పకూడదు.
మోసాల గురించి:
ఒక వ్యక్తికి ఏదైనా మోసం జరిగితే దాన్ని ఇతరులకి చెప్పకూడదు ఎందుకంటే ఈ విషయాన్ని చెప్పడం వలన మిగిలిన వారు అతడిని మూర్ఖుడిలా భావిస్తారు ఎగతాళి చేస్తారు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ విషయాలని ఇతరులతో పంచుకోవద్దు రహస్యంగానే ఉంచండి.